ఆస్తుల నమోదుకు బ్రేక్

60
Break to Register non-agricultural assets
Break to Register non-agricultural assets

Break to Register non-agricultural assets

తెలంగాణ ఐటీ శాఖ వ్యవహారం చూస్తుంటే జనాలకు నవ్వొస్తుంది. నగరాలు, పట్టణాల్లో ఉన్న వ్యవసాయేతర ఆస్తుల నమోదును చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. మరి, ఆ పని ప్రారంభించే ముందే, సాంకేతికంగా అన్ని అంశాల్ని పరిగణనలోకి తీసుకుని చేపట్టాలి. గరిష్ఠంగా ఎంతమంది ఒకేసారి లాగిన్ అయినా ఎలాంటి సమస్యలు ఏర్పకుండా ముందస్తుగా ఏర్పాట్లు చేయాలి. కానీ, అవేవీ చేయకుండా ఏకంగా మీ సేవ పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల నమోదును ప్రారంభించింది. అక్టోబరు 20 చివరి తేది అని చెబుతుండటంతో ప్రజలంతా ఒక్కసారిగా తమ  ఆస్తుల నమోదును చేపట్టారు. దీంతో, ముందు అనుకున్నట్లుగా సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో నమోదు వెబ్‌లింక్‌ను ఐటీశాఖ తొలగించింది. మరిన్ని సవరణలతో త్వరలో లింకును ఏర్పాటు చేస్తామని తెలిపింది. వీళ్ల పనులు చూస్తుంటే ప్రజలకు ఎక్కడ్లేని ఆగ్రహం వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Registration of Non-Agricultural Assets

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here