ప్రభుత్వ ఆసుపత్రిలో అల్పాహార వితరణ

ప్రభుత్వ ఆసుపత్రిలో అల్పాహార వితరణ – సీనియర్ జర్నలిస్ట్ కోటగిరి దైవాధీనమ్ సతీమణి జ్ఞాపకార్ధం రోగుల అటెండెంట్లకు అల్పాహారం – భవిష్యత్తులో కోటగిరి చంద్రకళ పేరుతో మరిన్ని సేవా కార్యక్రమాలు – – పాల్గొన్న కుటుంబ సభ్యులు, ఆర్యవైశ్య సంఘ నాయకులు, సమాచార హక్కు వికాస సమితి సభ్యులు నల్లగొండ : సీనియర్ జర్నలిస్ట్ కోటగిరి దైవాధీనమ్ సతీమణి కీ.శే కోటగిరి చంద్రకళ వివాహ వార్షికోత్సవం సందర్బంగా ఆయన సతీమణి జ్ఞాపకార్ధం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు 200 మంది రోగుల అటెండెంట్లకు అల్పాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ కోటగిరి దైవాధీనమ్ మాట్లాడుతూ తన భార్య కోటగిరి చంద్రకళ అనారోగ్యంతో మృతి చెందిన క్రమంలో ఆమె జ్ఞాపకాలను స్మరించుకుంటూ సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించి అల్పాహారం వితరణ చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో తన భార్య కోటగిరి చంద్రకళ పేరుతో చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి తన కుమారులు, కుటుంబ సభ్యుల సహకారంతో ఆమె పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మంచి ఆలోచనతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. భారతీయ సాంప్రదాయ వ్యవస్థలో వివాహ బంధం చాలా గొప్పదని అటువంటి బంధంలో ఒకరికొకరు తోడు నీడగా ఉంటూ జీవితంలో ముందుకు నడుస్తారని అన్నారు. భార్య చనిపోతే ఆ లోటు పురుషులకు ఎవరూ తీర్చలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్యవైశ్య సంఘంలో, జర్నలిజంలో సుదీర్ఘ అనుభవం ఉన్న దైవాధీనమ్ తన భార్య పేరుతో నిర్వహించే ప్రతి సామాజిక సేవా కార్యక్రమంలో తమ సహకారం ఉంటుందని తెలిపారు. జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి, టిఆర్ఎస్ నాయకులు యామ దయాకర్ మాట్లాడుతూ ఇతరులకు స్ఫూర్తి కలిగించే విధంగా తన భార్య జ్ఞాపకాలను స్మరించుకుంటూ సమాజ సేవలో భాగస్వామ్యం కావడం గర్వకారణంగా ఉందన్నారు. సమాచార హక్కు వికాస సమితి రాష్ట్ర అధ్యక్షుడు యరమాద కృష్ణారెడ్డి మాట్లాడుతూ తన సమితి రాష్ట్ర గౌరవ సలహాదారుగా సేవలందిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ దైవాధీనమ్ సతీమణి చంద్రకళ జ్ఞాపకార్ధం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనియమని అదే సమయంలో ఆయన తన భార్యను కోల్పోవడం చాలా బాధాకరమని, ఆ బాధను దిగమింగుకొని సమాజ సేవలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో దైవాధీనమ్ కుటుంబ సభ్యులు కోటగిరి రామకృష్ణ, రమ్యశాంతి, మనుమడు సాయి ధాత్రికే, మనుమరాలు దీక్షిత, ఆర్యవైశ్య సంఘ నాయకులు లక్ష్మీశెట్టి శ్రీనివాస్, రంగా వెంకన్న, వీరెల్లి సతీష్ కుమార్, సమాచార వికాస సమితి సభ్యులు యరమాద కృష్ణారెడ్డి, హేమలత, జిల్లా గౌరవ అధ్యక్షుడు యాళ్ల చంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు బైరు సైదులు గౌడ్, ప్రధాన కార్యదర్శి పోతేపాక యాదయ్య, శ్రీనివాస్, సాంబయ్య, కొత్తపల్లి కరుణ్ కుమార్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article