డెంగ్యూతో వధువు కన్నుమూత

BRIDE DIES WITH DENGUE

తెలుగు రాష్ట్రాల్లో డెంగ్యూ బారిన పడిన అనేకమంది మృత్యువాత పడుతున్నారు.  రెండు రోజుల క్రితం తెలంగాణలో డెంగ్యూ బారిన పడి ఓ కుటుంబం మొత్తం బలైన సంఘటన మరవక ముందే ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఓ పెళ్లి కూతురు పెళ్లి పీటలు ఎక్కక ముందే తనువూ చాలించింది. ముహుర్తానికి పెళ్లి పీటలు ఎక్కాల్సిన పెళ్లికూతురు డెంగ్యూ కు బలైపోయింది . నిండు నూరేళ్లు జీవించాలని కలలు కన్న, తన పెళ్లి పై బోలెడు ఆశలు పెట్టుకున్న యువతిని డెంగ్యూ కబళించింది. దీంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.  మరో మూడు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి డెంగ్యూ తో ప్రాణం పోగొట్టుకున్న వివరాల్లోకి వెళితే…

చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం టీవీఎన్‌ఆర్‌పురంలో నివాసం ఉంటున్న క్రిష్ణం రాజు, రెడ్డమ్మల కూతురు చంద్రకళకు అక్టోబర్‌ 30న పెళ్లి జరగాల్సి ఉంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. బంధువులు, కుటుంబసభ్యులతో ఇళ్లు సందడిగా మారింది. అయితే ఇదే సందర్భంలో పెళ్లికూతురు చంద్రకళ అనారోగ్యానికి గురైంది. చికిత్స కోసం స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. దీంతో ఆమేకు డెంగ్యూ సంబంధించిన లక్షణాలు బయటపడ్డాయి.ఈనేపథ్యంలోనే చంద్రకళకు మెరుగైన చికిత్స అందించడం కోసం జిల్లాలోని వేలూరు ఆసుపత్రికి తరలించారు.. అయితే అప్పటికే ఇంటికి బంధువులు అందరు ఇంటికి వచ్చిన నేపథ్యంలోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చంద్రకళకు పెళ్లి చేయాలని భావించారు. కాని ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షిణించడంతో 30వ తేదిన జరగాల్సిన పెళ్లిని సైతం వాయిదా వేశారు. దీంతో గత నాలుగు రోజులుగా ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న చంద్రకళ నేడు ఉదయం కన్నుమూసింది . దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.

GENERAL NEWS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article