గొంతు కోసి ఉపాధ్యాయుడి హత్య….

112

Brutal murder In Dummugudem Mandal Of Bhadradri

తెలంగాణా రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. దుమ్ముగూడెం మండలంలో ఓ ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉపాధ్యాయుడిని గుర్తు తెలియని వ్యక్తులు అర్థరాత్రి గొంతుకోసి చంపేశారు .  ఇక ఈ హత్య వివరాల్లోకి వెళ్తే..మండలంలోని లచ్చి గూడెం గ్రామంలో  నివశించే రామకృష్ణ  స్థానిక గవర్నమెంట్‌ స్కూల్లో కాంట్రాక్ట్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అతడు రాత్రి పూట నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు అతికిరాతకంగా అతని గొంతుకోసి హతమార్చారు. అడ్డుకోబోయిన మృతుడి భార్య తులసిని కూడా గాయపరిచి అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. ఆస్తి తగాదాల వల్లే ఈ హత్య జరిగినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలను బట్టి కేసు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Brutal murder In Dummugudem Mandal Of Bhadradri,telangana, bhadradri kottagudem district , dummu gudem , contract teacher , murder, neck cut , knife

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here