కాకినాడ:కాకినాడ మెయిన్ రోడ్ ఎస్ ఆర్ గ్రాండ్ లాడ్జ్ లో దారుణ హత్య జరిగింది. మృతుడు, నిందితుడు ఇద్దరిది కోనసీమ జిల్ల కాట్రేనికోన మండలం పల్లం గ్రామం. బుధవారం రాత్రి ఇద్దరూ లాడ్జ్ లో రూమ్ తీసుకొని ఇరువురు ఒకే గదిలో మద్యం సేవించినట్లు సమాచారం. తరువాత ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. నిందితుడు మల్లాడి రవి (26), కోపంతో పాలేపు కాసుబాబు ను బీరు బాటిల్ తో పొడిచి చంపివేసాడు. తరువాత నిందితుడు 2వ పట్టణ పోలీస్ స్టేషన్లు లో లొంగిపోయాడు. మద్యం మత్తులో ఘర్షణ ఏర్పడి హత్య జరిగినట్లు పోలీసులు నిర్దారించారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.