అత్యంత క్రూరంగా వైయ‌స్ వివేకా హత్య

BRUTALLY KILLED YS VIVEKANADA REDDY  … ఆ ముగ్గురికి అంతా తెలుసు

వివేకానంద‌రెడ్డిని అత్యంత క్రూరంగా చంపిన‌ట్లు సిట్ పోలీసులు తేల్చారు. ఆయ‌న మృతదేహంపై ఏడు చోట్ల పదునైన, లోతైన గాయాలున్నాయి. తలకైన తీవ్ర గాయాలు కనిపించకుండా బ్యాండేజీ వేశారు. వీటన్నిం టినీ విశ్లేషించిన తర్వాత అత్యంత క్రూరంగా వివేకాను హింసించి…ప్రమాదకరమైన ఆయుధంతో ఆయన తలపై దాడి చేసి చంపినట్లు తేలింది. హత్యకు పాల్పడిన దోషులెవరో తుమ్మలపల్లి గంగిరెడ్డి అలియాస్‌ ఎర్ర గంగిరెడ్డి, ములి వెంకటకృష్ణారెడ్డి, ఎద్దుల ప్రకాశ్‌లకు తెలుసు అన్నది పోలీసుల అభియోగం.
హత్య చేసిన వారిని చట్టం నుంచి తప్పించేందుకు వీరు ముగ్గురు సహకరించారన్నది పోలీసుల భావన. ఉద్దేశపూర్వకంగానే నేర ఘటనాస్థలం నుంచి సాక్ష్యాధారాలను తుడిచేసి..మాయం చేశారు ప్రస్తుతం రిమాండ్ కి తరలించిన ముగ్గురు. మార్చి 15న ఉదయం బాత్ రూమ్ లో హత్యకు గురైన వివేకా మృతదేహాన్నిబెడ్ రూమ్ కి తరలించినట్టు గుర్తించిన పోలీసులు…ఆ సమయంలో ఎర్ర గంగిరెడ్డి అక్కడే ఉన్నట్టు భావిస్తున్నారు. ఎర్ర గంగిరెడ్డి సొంతూరు కడప జిల్లా తొండూరు మండలం తేలూరు. 30 ఏళ్లుగా వివేకానందరెడ్డి, వైఎస్‌ కుటుంబంతో అతనికి సన్నిహిత సంబంధాలున్నాయి. గంగిరెడ్డి అవివాహితుడు. నూనె వ్యాపారంతో జీవితాన్ని ప్రారంభించి ఆయన.. అంచెలంచెలుగా ఎదిగారు. ఈ క్రమంలో వివేకాతో సన్నిహిత సంబంధాలు ఏర్పడటంతో పాటు రాజకీయంగానూ ఎదుగుదల ప్రారంభమైంది. వివేకా హత్య కేసులో సాక్ష్యాల తారుమారు వ్యవహారంలో గంగిరెడ్డినే ప్రధాన అనుమానితుడిగా భావిస్తూ పోలీసులు అరెస్టు చేయడం కీలక పరిణామం.
ఆ రోజు ఉదయం లేఖ దొరికినా సాయంత్రం వరకు పోలీసులకు ఎందుకు ఇవ్వలేదనే కారణంతో ఆయన పీఏ కృష్ణారెడ్డిని అరెస్టు చేసినట్టు ప్రకటనలో తెలిపారు.వివేకా పేరుతో ఉన్న లేఖను వంటమనిషి కుమారుడు ప్రకాశ్ కి కృష్ణారెడ్డి ఇచ్చి దాచిపెట్టినట్లు తెలిపారు.వివేకా హత్య జరిగిన రోజ ఉదయం 5.30 గంటలకు తొలిసారి ఇంట్లోకి వెళ్లిన కృష్ణారెడ్డి వివేకా మృతదేహాన్ని చూసినట్టు వెల్లడవడంతో అప్పటి నుంచి ఆయన ఇంట్లో ఏం చేశాడనే కోణంలో పోలీసులు విచారించారు. బాత్ రూమ్ నుంచి బెడ్ రూమ్ కి మృతదేహాన్ని తరలించడం, రక్తపు మరకలు కడగడం, నుదుటిపై కట్లు కట్టి మృతదేహానికి బట్టలు మార్చడం తదితర వ్యవహారంలో ఎర్ర గంగిరెడ్డి పాత్ర ప్రధానంగా ఉన్నట్టు గుర్తించిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అలాగే, పనిమనిషి లక్ష్మి కుమారుడు ప్రకాశ్‌ రక్తపు మరకలు కడిగాడని తెలిపారు. అయితే ఈ ఘటనలో ఈ ముగ్గురికి అంతా తెలుసనీ వీరని మరింత లోతుగా విచారిస్తే అసలు విషయం బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న సిట్ అధికారులు రిమాండ్ విధించిన వారిని కస్టడీ కి కోరుతున్నారు

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article