రెచ్చిపోయిన ప్రేమోన్మాది .. నడిరోడ్డుపైనే ఘాతుకం

BRUTALLY RAPED

నిర్భయ వంటి చట్టాలు వచ్చినా ప్రతిరోజూ ఏదో ఒక చోట ప్రేమోన్మాదులు దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. అత్యంత పాశవికంగా ప్రేమించిన యువతులను హతమార్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. తమను నిరాకరించారని ఉన్మాదంతో రెచ్చిపోయి యువతుల ప్రాణాలు తీస్తూనే ఉన్నారు. ఎన్ని కఠినతర చట్టాలు వచ్చినా ప్రతి నిత్యం ఏదో ఒక చోట ప్రేమ పేరుతో దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. అబలల ఆర్తనాదాలతో భరతమాత కన్నీరు చిందిస్తూనే ఉంది.ఇక తాజాగా హైదరాబాద్ లో కాచిగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని సత్యానగర్‌లో దారుణం జరిగింది. ఇవాళ ఉదయం ఓ యువతిపై ప్రేమోన్మాది దాడికి పాల్పడ్డాడు. తనను ప్రేమించడం లేదనే అక్కసుతో ఆ యువతిపై కొబ్బరి బొండాల కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను చికిత్స నిమిత్తం మలక్‌పేటలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. యువతిపై దాడికి పాల్పడ్డ యువకుడిని భరత్‌గా గుర్తించారు. బాధితురాలి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. బాధితురాలు మధులిక ఓ ప్రయివేటు కాలేజీలో చదువుతోంది. అయితే పొరుగింట్లో ఉన్న భరత్ తనను ప్రేమించాలని వెంట పడ్డాడు. ఈ విషయం తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో జనవరి నెలలో షీటీమ్స్ కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో భరత్ కు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినప్పటికీ అతనిలో మార్పు రాలేదు. తనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తారా? తనను ఎందుకు ప్రేమించడం లేదని వేధించడం మొదలుపెట్టాడు. ఉన్మాదిగా మారిన భరత్ ఇవాళ ఉదయం యువతి కాలేజీకి వెళ్తున్న క్రమంలో ఆమెపై కొబ్బరి బొండాల కత్తితో దాడి చేశాడు. తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా ఆమె వెంట పరుగెత్తి కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. బాధితురాలికి మెడ భాగంపై తీవ్రంగా గాయమైంది. చేతి నాలుగు వేళ్లు తెగిపోయాయి. తీవ్ర రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article