బుద్ధవనాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్

నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ లో బుద్ధవనాన్ని మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించారు. దేశంలో పేరొందిన బౌద్ధక్షేత్రంగా బుద్ధవనం ప్రాజెక్టు విలసిల్లు ఖాయమని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. టిబెట్ వియత్నాం సహా ఇతర దేశాల నుంచి వచ్చే సహకారం అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున తీసుకోవలసిన చర్యలను సైతం చెప్పుకొచ్చారు. బుద్ధవనం ప్రాజెక్టు ప్రారంభించి, వదిలేశాం అన్నట్లుగా కాకుండా  ప్రపంచ స్థాయిలో పేరు వచ్చేలాగా మెయిన్టెయిన్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు మహమూద్ అలీ, జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనవాస్ యాదవ్, సబిత ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, చామకూర మల్లారెడ్డి,, స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్, కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article