ఎలక్షన్ స్టంట్.. 4 వాయిదాల్లో ఫీజులు

65
Building Fees In 4 Instalments?
Building Fees In 4 Instalments?

Building Fees In 4 Instalments?

2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచేందుకు రియల్ రంగానికి ఎక్కడ్లేని ప్రోత్సాహాకాన్ని ప్రకటించిన ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రియల్ సంస్థలు భవనాలకు చెల్లించే రుసుములు, ఇతర ఛార్జీలను రెండేళ్లలోపు నాలుగు విడతల్లో కట్టేందుకు అంగీకరించింది. ఈ నిర్ణయాన్ని మళ్లీ కేవలం వచ్చే ఏడాది మార్చి 31వరకే వర్తింపజేసింది. కొవిడ్ నుంచి కోలుకునే సమయంలో అనవసరంగా రెండు నెలలు రిజిస్ట్రేషన్లు నిలిపివేసి రియల్ రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా దెబ్బతీసింది. దీంతో, అధిక శాతం నిర్మాణ సంస్థలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల రియల్ సంస్థలు పెద్దగా సంతోషించడం లేదని సమాచారం. 

కొవిడ్ వల్ల దెబ్బతిన్న నిర్మాణ రంగానికి ఊతమిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాన్ని తీసుకుంది. బిల్డింగ్ పర్మిట్ ఫీజు, బెటర్ మెంట్ ఛార్జీలు, డెవలప్మెంట్ ఛార్జీలు, క్యాపిటలైజేషన్ ఛార్జీలు వంటివి నాలుగు వాయిదాల్లో కట్టేందుకు అనుమతిని మంజూరు చేసింది. అంటే రెండేళ్లలో ఆరు నెలలకోసారి ఈ రుసుముల్ని చెల్లించేందుకు అంగీకరించింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ సోమవారం జీవో విడుదల చేశారు. దీని ప్రకారం.. ఫీజు చెల్లించాలనే లెటర్ అందిని ముప్పయ్ రోజుల్లోపు స్థిరాస్తి సంస్థలు మొదటి వాయిదాను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా డెవలపర్ మొత్తం ఫీజును ఒకేసారి చెల్లించేందుకు ముందుకొస్తే, మొత్తం ఫీజులో ఐదు శాతం డిస్కౌంటును అందజేస్తారు. అలా అని డెవలపర్లు సకాలంలో వాయిదా సొమ్మును చెల్లించకపోతే, ఆలస్యమైన కాలానికి పన్నెండు శాతం జరిమానాను కట్టాల్సి ఉంటుంది. ఈ అవకాశాన్ని 2021 మార్చి 31లోపు చేసే దరఖాస్తులకు వర్తిస్తుంది. ఈ సదుపాయాన్ని ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు వర్తింపజేయాలని క్రెడాయ్ హైదరాబాద్, ట్రెడా, టీబీఎఫ్, టీడీఏ వంటి నిర్మాణ సంఘాలు అభ్యర్థించగా అందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.

GHMC ELECTIONS 2020

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here