రాధాకు బంపర్ ఆఫర్

Bumper offer for Radha….అందుకే టీడీపీలో రాధా చేరిక ఫిక్స్

ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారు అనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. నిన్నటి వరకు వైసిపి లో ఉన్న వంగవీటి రాధాకృష్ణ వైసిపికి రాజీనామా చేసి టీడీపీలో చేరనున్నారన్న వార్త విజయవాడ రాజకీయాల్లో దుమారం రేపుతోంది.
ఇక టీడీపీ సైతం బలమైన సామాజిక వర్గానికి చెందిన ఈ నేత ను ఎలాగైనా పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించుకొని రాధా కు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
బలమైన సామాజిక వర్గానికి చెందిన, ప్రజాదరణ ఉన్న నేత వంగవీటి రాధాకృష్ణ వైసిపికి రాజీనామా చేశారు. గత నాలుగు నెలలుగా వైసిపి లో విజయవాడ నగరంలో నెలకొన్న హైడ్రామాకు రాజీనామాతో తెరదించారు. విజయవాడ సెంట్రల్ నుండి టికెట్ ఆశించిన వంగవీటి రాధాకృష్ణ జగన్ విజయవాడ సెంట్రల్ టికెట్ మల్లాది విష్ణు కి కేటాయించడంతో అప్పుడే రగిలిపోయారు. ఇక ఆయన అనుచరులు వైసీపీ కార్యాలయం ముందు రచ్చ చేసారు. పార్టీ మారాలని నిర్ణయం సైతం తీసుకున్నారు. అయితే వంగవీటి రాధాకృష్ణను విజయసాయిరెడ్డి బుజ్జగించే ప్రయత్నం చేశారు. మచిలీపట్నం ఎంపీ టికెట్ ఇస్తామంటూ ఆయనను అందించడానికి ప్రయత్నించారు వైసిపి ముఖ్య నాయకులు. ఇక ఆ తర్వాత మచిలీపట్నం ఎంపీ టికెట్ కూడా బాలశౌరి కి కేటాయించారు జగన్మోహన్ రెడ్డి. ఎంతో పొమ్మనలేక పొగ పెడుతున్నట్లుగా అర్థం చేసుకున్న వంగవీటి రాధాకృష్ణ పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. ఇక అప్పటి నుండి ఆయన తోటి జనసేన పార్టీ నుండి, అలాగే టిడిపి నుండి ముఖ్య నేతలు మంతనాలు జరుపుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా తనకు టికెట్ రాదని క్లారిటీకి వచ్చిన వంగవీటి రాధాకృష్ణ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాసి రాజీనామా చేశారు. ఇక ఆ లేఖలో మీరు సీఎం అవ్వడం కోసం ఆంక్షలు పెడితే ఆ ఆంక్షలతో పార్టీలో కొనసాగలేనని ఆంక్షలు లేని ప్రజా ప్రయాణం కోసం పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ఇక ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లో తన అరుణ ప్రకటిస్తానని వంగవీటి రాధాకృష్ణ చెప్పిన నేపథ్యంలో అటు జనసేన నుండి, ఇటు టిడిపి నుండి నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే టిడిపి లోని వంగవీటి రాధా చేరబోతున్నట్లు గా ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే టిడిపిలో ముఖ్య నేత ఒకరు గత నాలుగు నెలలుగా వంగవీటి రాధా కృష్ణ తో మంతనాలు జరుపుతున్నట్లు గా తెలుస్తోంది. కొందరు అభిమానులు అభిమానులు జనసేనలో చేరాలని పట్టుబడుతుండగా.. రాధా అడుగులు మాత్రం టీడీపీ వైపే పడుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మొత్తానికి వంగవీటి రాధాకృష్ణ సైకిల్ ఎక్కడున్నారన్న వార్త ప్రస్తుతం విజయవాడలో సంచలనంగా మారింది.
ఒకపక్క రాధా సన్నిహితులు మాత్రం ఆయన టీడీపీలో చేరితే భవిష్యత్తు బాగుంటుందని సూచిస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. మరోపక్క టీడీపీ నేతలు సైతం ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించేందుకు సుముఖంగా ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇక ఆయన పార్టీలో చేరడానికి ముహూర్తం కూడా దాదాపుగా ఖరారైంది.జనవరి 24న రాధా టీడీపీలో చేరనున్నారని ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. ఏపీలో కాపు సామాజిక వర్గం చాలా బలమైన సామాజిక వర్గం. కాపు సామాజికవర్గంలో వంగవీటి కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది.ఈ నేపథ్యంలో రాధా చేరిక పార్టీకి ఉపయోగపడుతుందన్న ఆలోచనలో టీడీపీ నేతలు ఉన్నారు. అయితే దేవినేని , వంగవీటి కుటుంబాల మధ్య లో మనస్పర్ధలు గొడవలు ఉన్నాయని ప్రచారం జరిగిన నేపథ్యంలో విజయవాడ అర్బన్‌ టీడీపీ అధ్యక్షుడు బుద్ధా వెంకన్న ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. వారి కుటుంబాల మధ్య లో ఎలాంటి విభేదాలు లేవని, ఒకవేళ ఉన్నా అదంతా గత మని ఆయన కొట్టిపారేశారు. ఇప్పుడు ఒకే పార్టీలో ఇరువురు కలిసి మెలిసి పని చేస్తారని చెప్పుకొచ్చారు.పార్టీలోకి మంచివారు ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని ప్రకటించారు. అయితే నిన్న రాజీనామా చేసినప్పటి నుంచి వరుస చర్చల్లో ఉన్న రాధా టిడిపి నేతలతో సమావేశం అయినట్టు తెలుస్తుంది. రాధా కు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చే అవకాశం లేకపోయినా, ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వటానికి అధిష్టానానికి ఏమి అభ్యంతరం లేదని అందుకు చంద్రబాబు సైతం అంగీకరించారని చర్చల్లో పాల్గొన్న టిడిపి నేతలు చెప్పినట్టు తెలుస్తుంది. అయితే రాధా వర్గీయులు మాత్రం మంత్రి పదవి కావాలని పట్టుబట్టినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఆయన చెప్పిన వారికి కానీ, ఆయనకు కానీ ఎదో ఒక నామినేటెడ్ పోస్ట్ ఇచ్చేలా నాయత్వంతొ చర్చలు జరుపుతామని టీడీపీ ముఖ్య నేతలు చెప్పినట్టు తెలుస్తుంది. ఇక దీంతో రాధా కు టీడీపీ ఇచ్చిన ఆఫర్ తో సంతృప్తి చెందిన నేపథ్యంలో రాధా, తన అనుచరులు 24 ఉదయం 11:53 నిమిషాలకు టిడిపిలో చేరటానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి మరో రెండు రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పిన రాధా తాజా సమాచారం ప్రకారం రేపు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి తాను టిడిపిలో చేరే విషయాన్ని వెల్లడించే అవకాశముంది. మరోపక్క జనసేన పార్టీ సైతం ఆయనను తమ పార్టీలో చేర్చుకోవడానికి విఫలయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. టిడిపి నుండి బంపర్ ఆఫర్ పొందిన వంగవీటి రాధా కచ్చితంగా టిడిపిలో చేరుతారనే భావన టిడిపి శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article