అల్లు అర్జున్ వర్సెస్ రామ్ చరణ్

19
Bunns vs Ram charan
Bunns vs Ram charan

Bunns vs Ram charan

మెగా ఫ్యాన్స్ లో ఇప్పుడు హాట్ హాట్ గా సాగుతోన్న డిస్కషన్ ఇదే. అల్లు అర్జున్ వర్సెస్ రామ్ చరణ్.. నిజంగా ఇదో టఫ్ కాంపిటీషన్. కానీ ఇందులో ఎవరు గెలుస్తారు అనేది ఇప్పుడే చెప్పడం కష్టం. కారణం.. ఒకటీ రెండు సినిమాలు చూసుకుని డిసైడ్ చేసే అంశం కాదిది. అదే టైమ్ లో ఒక విషయం డిక్లేర్ అవ్వాల్సిన టైమ్ కూడా. అదే మెగాస్టార్ కు వెండితెర వారసుడు ఎవరు అనేది..? చాలామంది వెంటనే ఇంకెవరూ.. రామ్ చరణే కదా అనుకుంటారేమో. కానీ అల్లు అర్జున్ అండ్ ఫ్యాన్స్ మాత్రం మెగా లెగసీని ఆ రేంజ్ లో తీసుకువెళ్లే సత్తా తమకే ఉందని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే అతని ప్లాన్స్ ఉన్నాయి. అయితే జెనెటికల్ వారసుడుగా ఉన్న రామ్ చరణ్ అల్లు అర్జున్ స్థాయిలో దూకుడు చూపించడంలో వెనకబడి ఉన్నాడు. ప్లానింగ్ లో సైతం పెద్దగా దూకుడు కనిపించడం లేదు. కేవలం ఆర్ఆర్ఆర్ తోనే అల్లు అర్జున్ అల వైకుంఠపురములోను ఢీ కొట్టడం అసాధ్యం. ఎందుకంటే సగం క్రెడిట్ ఎన్టీఆర్ కూ వెళుతుంది కాబట్టి. మరోవైపు బన్నీకి ఫ్యాన్ బేస్ ఎక్కువగా కనిపిస్తోంది.

ఇది చరణ్ లో లోపిస్తోంది. తెలుగులో కాకుండా ఇతర భాషల్లో ఆ రేంజ్ లో ఫ్యాన్స్ రామ్ చరణ్ కు లేరనేది నిజం. కేవలం మెగాస్టార్ ఫ్యాన్స్ మాత్రమే ఈయన్ని అనుసరిస్తున్నారు తప్ప.. తనదైన యూనిక్ స్టైల్ లేదా నటనతో సరికొత్త అభిమానులను బయటి రాష్ట్రాల నుంచి సంపాదించుకోలేదు. రంగస్థలం వంటి ఎపిక్ హిట్ తర్వాత ఆ జోష్ ను కంటిన్యూ చేయడానికి వినయవిధేయరామ్ బిగ్గెస్ట్ స్పీడ్ బ్రేకర్ గా మారింది. అటుపై ఆర్ఆర్ఆర్ ఆలస్యం, లాక్ డౌన్ వంటి వన్నీ చరణ్ కు ప్రతికూలాంశాలుగానే ఉన్నాయి. ఇదే టైమ్ లో అల్లు అర్జున్ కు అల వైకుంఠపురములో అనుకోని అవకాశంగా కలిసొచ్చింది. మొత్తంగా ఇప్పుడు మెగా ఫ్యామిలీలో ఈ ఇద్దరిలో ఎవరు బెస్ట్ అనే డిస్కషన్ మాత్రం హాట్ హాట్ గా సాగుతోంది. ఇప్పటికే తను పవన్ కళ్యాణ్ కంటే బెస్ట్ అనే భావనలో ఉన్నాడు అల్లు అర్జున్. ఇప్పుడు చరణ్ విషయంలోనూ అదే భావన కనిపిస్తోంది. పైగా తను మెగా హీరో అనే ట్యాగ్ ను వదిలించుకుని చాలా రోజులు అవుతోంది. అల్లువారబ్బాయ్ గానే మెగా హీరోలను దాటేయాలనే తపన బన్నీలో కనిపిస్తోంది. తపన మాత్రమే కాదు.. అందుకు తగ్గట్టుగా ప్లానింగ్స్ కూడా కనిపిస్తున్నాయి. మరి వీటిని బీట్ చేసేలా చరణ్ నుంచి ఎలాంటి ప్లానింగ్స్ ఉంటాయనేది ఆసక్తిగా మారింది.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here