Reason For Bunny by Priya Praksh Warrior
ఒక కన్ను గీటతో, పాటతో నేషనల్ రేంజ్ క్రేజ్‌ను సొంతం చేసుకుంది మలయాళ సొగసరి ప్రియా ప్రకాశ్ వారియర్. దాంతో ఆమెకు బాలీవుడ్ సహా అన్ని భాషల చిత్రాల నుండి అవకాశాలు వచ్చాయి. అయితే ఆమె ఏ సినిమాలో నటించలేదు. దాంతో ప్రియా ప్రకాశ్ ఎక్కువ రెమ్యునరేషన్ అడుగుతుంది. నిర్మాతలు కాదంటుండంతో సినిమాలు చేయడం లేదనే రూమర్స్ వినిపించాయి. అయితే దీనిపై ప్రియా ప్రకాశ్ వివరణ ఇచ్చింది. `ఒరు ఆడార్ లవ్` సాంగ్‌ను ముందు చిత్రీకరించి రిలీజ్ చేశారట. తర్వాతే సినిమా చిత్రీకరణను ప్రారంభించారట. దాంతో ఏడాది పాటు ప్రియా మరే సినిమాలో చేసే అవకాశం లేకుండా పోయింది. అలా మిస్ అయిన అవకాశాల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` సినిమా కూడా ఒకటి అని రీసెంట్ ఇంటర్వ్యూలో ఈ అమ్మడు చెప్పుకొచ్చింది.
Check Out For More Discounts In AMAZON
For More Interesting News visit TSNEWS.TV