ప్రియా కోసం బ‌న్ని

Bunny for priya
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఓ హీరోయిన్ ఆడియో వేడుక‌కు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. స్టార్ హీరో వ‌స్తున్నాడంటే అంత పెద్ద న‌టి ఎవ‌రో అనే ఆలోచ‌న రావ‌చ్చు ఆమె ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌. ఆమె న‌టించిన `ఒరు ఆధార్ ల‌వ్‌` చిత్రాన్ని `ల‌వ‌ర్స్ డే` పేరుతో తెలుగులో విడుద‌ల చేస్తున్నారు.   సుఖీభ‌వ సినిమాస్ సంస్థ విడుద‌ల చేస్తోంది. ఎ. గురురాజ్‌, సి.హెచ్‌.వినోద్‌రెడ్డి నిర్మాత‌లు. ఒమ‌ర్ లులు ద‌ర్శకుడు. ఫిబ్రవ‌రి 14న విడుద‌ల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల 23న హైద‌రాబాద్‌లో ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు. ఈ ఫంక్ష‌న్‌కి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజ‌రుకాబోతున్నారు. చిన్నగా క‌న్నుగీటి దేశం మొత్తం క్రేజ్ సంపాదించుకున్న ప్రియా కోసం బ‌న్ని ముఖ్య అతిథిగా రావ‌డం గొప్ప విష‌య‌మే క‌దా మ‌రి!.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article