పవన్ ఫ్యాన్స్ కు అల్లు అర్జున్ సాయం

34
bunny helps pawan fans
bunny helps pawan fans

bunny helps pawan fans

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా చిత్తూరు జిల్లా కుప్పంలో కొందరు యువకులు హోర్డింగ్స్ కడుతుండగా.. విద్యుత్ షాకు గురై ముగ్గురు చనిపోయారు. నిన్న జరిగిన ఈ దురదృష్టకర సంఘటన గురించి ఇప్పటికే మెగా ఫ్యామిలీ హీరోలంతా ఆ కుటుంబాలకు సానుభూతి ప్రకటించి అభిమానులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ సైతం ఆ కుటుంబాలకు సానుభూతిని తెలుపుతూనే.. తన వంతుగా మరణించిన ముగ్గురు కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించాడు. ఒక్కొక్కరికి రెండు లక్షల చొప్పున అందించబోతున్నట్టుగా ట్విట్టర్ లో వెల్లడించాడు. మొత్తంగా అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలు అంటూ వస్తోన్న వార్తలకు బన్నీ ట్వీట్ తో చెక్ పడినట్టైంది. ఒకవేళ విభేదాలున్నా.. మెగా ఫ్యాన్స్ అంటే అందరికీ సమానమే అన్న సంకేతాలను కూడా అల్లు అర్జున్ పంపినట్టుగా భావించవచ్చు.

నిజానికి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత యువకులదే. హద్దులు మీరిన అభిమానమే.. జాగ్రత్తలు లేని అభిమానం కూడా ప్రమాదమే. ఈ ప్రమాదంలో ఎవరి నిర్లక్ష్యం ఉందన్న విషయం పక్కన బెడితే ఆ మూడు కుటుంబాలకు జీవితాంతం తీరని లోటనే చెప్పాలి. ఏదేమైనా అల్లు అర్జున్ ట్వీట్ తో పాటు చాలామంది మెగా ఫ్యాన్స్ కూడా ఆ కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. దీనివల్ల మరణించిన వారి కుటుంబాలకు కొంత ఆర్థిక బలం చేకూరినా మనిషిని రీ ప్లేస్ చేయలేదు కదా. అందుకే అభిమానులు కాస్త జాగ్రత్తగా వ్యవహరించి.. ఇలాంటి ప్రమాదాలతో మీ అభిమాన హీరోల పుట్టిన రోజు లేదా ఇతర వేడుకలను విషాదంగా నింపొద్దని ప్రతి ఒక్కరూ భావించాలి.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here