అల్లు అర్జున్ – కొరటాల సినిమా కన్ఫార్మ్

40
bunny helps pawan fans
bunny helps pawan fans

bunny-koratala movie

కొన్ని కాంబినేషన్స్ లో సినిమా రావాలని చాలామంది అనుకుంటారు. కానీ అవి లేట్ అవుతుంటాయి. బట్.. లేట్ అయినా లేటెస్ట్ గా అన్నట్టుగా తెలుగులో ఈ క్రేజీ కాంబినేషన్ ఫైనల్ సెట్ అయిపోయింది. అయితే అనూహ్యంగా అఫీషియల్ గా అనౌన్స్ కావడంతో అంతా సర్ ప్రైజ్ అవుతున్నారు. ఇలాంటి కాంబో గురించి ఆ హీరో ఫ్యాన్స్ ఎన్నాళ్లుగానో వెయిట్ చేస్తున్నారు కూడా.ఏమైతేనేం.. వారి వెయిటింగ్ ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇంతకీ ఈ క్రేజీ కాంబినేషన్ ఏంటీ అనుకుంటున్నారా.. జస్ట్ వాచ్ ఇట్. మోస్ట్ స్టైలిష్ స్టార్ గా టాలీవుడ్ తో పాటు సౌత్ లోనూ తిరుగులేని క్రేజ్ ఉన్న స్టార్ అల్లు అర్జున్. మాలీవుడ్ లో ఓ స్టార్ హీరో రేంజ్ ఫ్యాన్స్ ను సంపాదించుకున్న అల్లు అర్జున్ రీసెంట్ గానే అల వైకుంఠపురములోతో ఇండస్ట్రీ రికార్డ్స్ బద్ధలు కొట్టాడు. ఇలాంటి విజయం కోసం అతను చాలాకాలంగా వెయిట్ చేస్తున్నాడు. అయితే అతను కూడా ఊహించని రేంజ్ లో త్రివిక్రమ్ డైరెక్షన్ లోవచ్చిన అల వైకుంఠపురములో ఏకంగా నాన్ బాహుబలి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో ‘పుష్ప’మూవీకి ప్రిపేర్ అవుతున్న అల్లు అర్జున్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో సినిమా అఫీషియల్ గానే అనౌన్స్ కావడం టాలీవుడ్ ను సైతం ఆశ్చర్యపరిచింది. మెసేజ్ ఓరియంటెడ్ కథలతో కమర్షియల్ విజయాలూ సాధిస్తూ.. తక్కువ టైమ్ లోనే స్టార్ డైరెక్టర్ అనిపించుకున్నాడు కొరటాల శివ. అతనితో సినిమాలు చేసిన హీరోల రేంజ్ కూడా మారిపోయింది.. ఇదీ ఓ సెంటిమెంట్ గానే మారింది. అందుకే చాలామంది స్టార్లు.. కొరటాలతో సినిమా కోసం ఉత్సాహంగా ఉన్నారు. ప్రస్తుతం చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా ఆచార్య అనే సినిమాను రూపొందిస్తున్నాడు కొరటాల. ఇప్పటికే 30శాతం షూటింగ్ పూర్తయిందీ చిత్రం.

ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా అన్ని సినిమాల్లాగే షూటింగ్ ఆగిపోయింది. కరోనా గొడవ తగ్గిన తర్వాత ఆచార్య మళ్లీ పట్టాలెక్కుతుంది. భరత్ అనేనేను తర్వాత కొరటాలకు చాలా గ్యాప్ వచ్చింది. అంతకు ముందే చిరంజీవితో సినిమా కోసం కథ సిద్ధం చేసుకున్నాడు. కానీ ఈ ప్రాజెక్ట్ అనుకున్నదానికంటే చాలా లేట్ అయింది. ఇప్పుడు కరోనా రావడంతో నాలుగు నెలలుగా ఖాళీ. ఈ టైమ్ లోనే ఓ పవర్ ఫుల్ స్టూడెంట్ యూనియన్ లీడర్ కథ రాసుకున్నాడట. దీనికి అల్లు అర్జున్ అయితే కరెక్ట్ గా ఉంటుందని అతనికి కథ చెప్పాడు. ఇలాంటి కథ అర్జున్ కూడా ఇంతకు ముందు చేయలేదు. పైగా కొరటాల టేకింగ్, మాస్ ఎలిమెంట్స్, హీరోయిజం వేరుగా ఉంటాయి కదా. అందుకే కొరటాల కథ చెప్పిన వెంటనే ఓకే చెప్పాడు. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత అల్లు అర్జున్ పుష్ప సినిమా పూర్తి చేస్తాడు. ఇటు కొరటాల ఆచార్య కంప్లీట్ చేస్తాడు. అంటే ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రావడానికి ముందు ఈ రెండు సినిమాలూ విడుదలవుతాయన్నమాట. మరి వాటి విజయాలను బట్టి ఈ కాంబినేషన్ పై అంచనాలు మారతాయి. ఏదేమైనా కొన్నాళ్లుగా కొరటాల, అల్లు అర్జున్ కాంబినేషన్ గురించి వార్తలు వచ్చాయి. ఈ కాంబినేషన్ కోసం తానూ చాలా రోజులుగా చూస్తున్నానని ట్వీట్ చేశాడు బన్నీ. అల్లు అర్జున్ బెస్ట్ ఫ్రెండ్స్ అంతా ఈ మూవీతో నిర్మాణ రంగంలోకి దిగుతుండటం విశేషం. ఏదేమైనా ఈ సారి తన హీరోను కొరటాల ఎలా ప్రెజెంట్ చేయబోతాడనేది ఆసక్తిగా మారిందిప్పుడు.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here