అల్లు అర్జున్ – కొరటాల మధ్య తేడాలొచ్చాయా..?

18
koratala in underground
koratala in underground

bunny-koratala

స్టైలిష్ స్టార్ గా తిరుగులేని క్రేజ్ ఉన్న హీరో అల్లు అర్జున్. తెలుగులో అంతకు ముందు లేని విధంగా సౌత్ లోని ఇతర భాషల్లో కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. అయితే ఆ మార్కెట్ ను ఇప్పుడు విస్తరించుకునే పనిలో చాలా సీరియస్ గా ఉన్నాడు బన్నీ. కొన్ని రోజుల క్రితం వరకూ అతని సీరియస్ నెస్ కు సెలెక్షన్ ఆఫ్ స్టోరీస్ కాస్త అడ్డుపడ్డాయి. అందుకు తగ్గట్టుగానే ఫలితాలు కూడా ఉండటంతో స్పాన్ పెంచుకోవడం కుదరలేదు. అయితే చివరగా వచ్చిన అల వైకుంఠపురములోతో ఒక్కసారిగా అందరు స్టార్స్ ను దాటిపోయాడు. ఈ మూవీ కమర్షియల్ గా నాన్ బాహుబలి రికార్డ్స్ క్రియేట్ చేయడంతో అల్లు అర్జున్ ఇప్పుడు పూర్తిగా తన ఇమేజ్ స్పాన్ ను ప్యాన్ ఇండియన్ రేంజ్ కు విస్తరించాలనుకుంటున్నాడు. అందుకే తను చేయబోయే అన్ని సినిమాలను ఆ స్థాయిలో కథలు ఉండేలా చూసుకుంటున్నాడు. ప్రస్తుతం సుకుమార్ తో చేస్తోన్న పుష్ప కథ కూడా మొదట్లో తెలుగు ప్రేక్షకులను టార్గెట్ చేసుకుని ఉన్నదే. కానీ అల్లు అర్జున్ కోరిక మేరకు అది ప్యాన్ ఇండియన్ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకునేలా మారిపోయింది. ఇప్పుడు కొరటాల శివతో సినిమా విషయంలో కూడా ఇదే రూల్ ఫాలో అవుదాం అనుకున్నాడట అల్లు అర్జున్. అయితే కొరటాల మాత్రం తన కథ కేవలం తెలుగు ప్రేక్షకులనే దృష్టిలో పెట్టుకుని రాసుకున్నాడట.

అయితే పుష్పలాగే ఈ కథను కూడా ప్యాన్ ఇండియన్ ఆడియన్ కు కనెక్ట్ అయ్యేలా రూపొందించాలని అర్జున్- కొరటాలకు చెప్పాడట. కానీ కొరటాల శివ అందుకు సిద్ధంగా లేడు అనేది లేటెస్ట్ న్యూస్. తన కథ విషయంలో మార్పులకు కొరటాల పెద్దగా అంగీకరించడు. అందుకే జనతా గ్యారేజ్ లాంటి కథను ఎన్టీఆర్ పై రుద్దాడు అనేవాళ్లూ ఉన్నారు. ఈ సినిమాలో విలన్ పాతికేళ్లైనా మారకపోవడం, సెకండ్ హాఫ్ కు వచ్చిన తర్వాత గ్యారేజ్ కథలో ఏ మార్పూ లేకపోవడం ఉదాహరణగా చెప్పేవాళ్లు ఉన్నారు. అందువల్ల అల్లు అర్జున్ చెప్పిన కథా విస్తరణకు శివ సిద్ధంగా లేడంటున్నారు. ఈ కారణంగానే ఇద్దరి మధ్య మనస్ఫర్థలు వచ్చాయనీ.. అల్లు అర్జున్.. సంక్రాంతి బరిలో సరిలేరు నీకెవ్వరుతో లాగా మరోసారి పంతానికి పోయినా ఆశ్చర్యం లేదని వినిపిస్తోంది. అంటే తన మాటే నెగ్గాలి. లేదంటే ప్రాజెక్ట్ నే క్యాన్సిల్ చేసుకునేందుకూ సిద్ధం అనేలా.. మామూలుగా అల వైకుంఠపురములోతో అతను మంచి బూమ్ లో ఉన్నాడు. ఆ బూమ్ ను ప్యాన్ ఇండియన్ గా మార్చాలనే తాపత్రయంలోనే ఇలాంటి నిక్కచ్చి నిర్ణయంతో ఉన్నాడంటున్నారు. మరి అల్లు అర్జున్ వైఖరి ఎంత వరకూ కరెక్ట్ అని ఆలోచించేకంటే.. కొరటాల శివ మూవ్ ఎలా ఉంటుందనేదే ఇంట్రెస్టింగ్ గా మారింది.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here