మళ్లీ సుక్కు-బన్నీ కాంబినేషన్

BUNNY NEW MOVIE WITH SUKKU

  • సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ 20వ సినిమా
  • అధికారికంగా పోస్టర్ విడుదల

స్టైలిష్ట్ స్టార్ అల్లు అర్జున్ 20వ సినిమాపై అనూహ్యమైన ప్రకటన వచ్చింది. తన కొత్త సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో ప్రారంభించనున్నట్టు అనౌన్స్ మెంట్ వెలువడింది. నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా సినిమా తేడా కొట్టిన తర్వాత దాదాపు ఎనిమిది నెలలుగా ఖాళీగా ఉన్నబన్నీ తదుపరి సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పట్టాలు ఎక్కాల్సి ఉంది. అయితే, ఈ సినిమా ఇంకా ప్రారంభం కాకుండానే బన్నీ 20వ సినిమాపై ప్రకటన వెలువడింది. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందనుంది. ఈ మేరకు అధికారికంగా ఓ పోస్టర్ విడుదల చేశారు. అయితే షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది, విడుదల ఎప్పుడు ఉండొచ్చు అనే వివరాలు మాత్రం ఇందులో లేవు. ఇంకొద్ది రోజుల్లో త్రివిక్రమ్ మూవీ స్టార్ట్ అవుతుంది. అది పూర్తయ్యాకే సుక్కు సినిమా ఉండొచ్చని అంటున్నారు. ఆర్య తో బన్నీకి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన సుకుమార్.. మరోసారి తమ అభిమాన హీరోకి హిట్ ఇవ్వడం ఖాయమని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే రంగస్థలం సినిమాతో చరణ్ కు తిరుగులేని హిట్ ఇచ్చిన సుక్కు.. ఈసారి ఎలాంటి కథతో వస్తాడో అని అంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. అయితే, ప్రిన్స్ మహేశ్ బాబుతో సుకుమార్ సినిమా ఉంటుందా ఉండదా అనేదానిపై ప్రస్తుతం సస్పెన్స్ నెలకొంది. ప్రస్తుతం సుక్కు టీం.. మహేశ్ సినిమా కథపై కసరత్తు చేస్తోంది. ఇక్కడ బన్నీ-త్రివిక్రమ్ సినిమా అయ్యేలోపే సుక్కు.. మహేశ్ తో మూవీ పూర్తిచేసి అప్పుడు బన్నీతో సినిమాపై దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తోంది.

TELUGU CINEMA

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article