బ‌న్నితో సాహో అనిపించ‌నున్నాడా?

Sahoo Sujith next movie with Bunny

శ‌ర్వానంద్ హీరోగా సుజిత్ తెరెక్కించిన చిత్రం `ర‌న్ రాజా ర‌న్‌`. క‌మ‌ర్షియ‌ల్ హీరోగా శ‌ర్వాకు బ్రేక్ ఇచ్చిన మూవీ ఇది. దీని త‌ర్వాత సుజిత్ ఏకంగా యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌ను డైరెక్ట్ చేసే అవ‌కాశాన్ని ద‌క్కించుకున్నాడు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం `సాహో`.. ఆగ‌స్ట్ 15న విడుద‌ల చేయ‌డానికి ప్లాన్స్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత సుజిత్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బ‌న్నితో సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌. ఇటీవ‌ల బ‌న్నిని క‌లిసి స్టోరీ లైన్ చెప్ప‌గా.. బ‌న్నికి న‌చ్చింద‌ట‌. పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసే క‌థ‌ను వినిపించ‌మ‌ని చెప్పాడ‌ట‌. ఇప్పుడు సుజిత్.. బ‌న్ని కోసం స్క్రిప్ట్ రెడీ చేసే ప‌నిలో ఉన్నాడ‌ట‌.

Check Out Latest Offers in Amazon

For more Political New

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article