ఆ బర్గర్ చాలా కాస్ట్లీ గురూ

Spread the love

Burger Costs RS 70000

జంక్ ఫుడ్ ప్రియులకు టక్కున ఆర్డర్ చేసేంది బర్గర్. ఒక బర్గర్ ఖరీదు ఎంతుంటుంది చెప్పండి. రూ.100 లేదా రూ.150 పోనీ… మంచి రెస్టారెంట్లలో కాస్ట్ ఇంకా ఎక్కువుంటుందంటారా? ఎంత పెద్ద స్టార్ హోటల్ అయినా..1000 కంటే ఎక్కువుండదు కదా..కానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బర్గర్ ఖరీదు ఎంతో తెలిస్తే బేజార్ అవ్వాల్సిందే. ఈ బర్గర్ గోల్డెన్‌ జెయింట్‌ బర్గర్‌ ప్రియులను ఆకట్టుకుంటోంది. అలరిస్తోంది.

టోక్యోలోని గ్రాండ్ హ‌య‌త్ హోట‌ల్ ఈ బ‌ర్గ‌ర్ త‌యారు చేసింది. దాని పేరు జ‌ప‌నీస్ బ‌ర్గ‌ర్. ఈ బర్గర్‌ను టేస్ట్ చేయాలంటే ఇండియా కరెన్సీలో రూ. 70,000లు సమర్పించుకోవాల్సిందే. ఇంత ఖరీదు ఉందీ అంటే దాంట్లో స్పెషల్ ఏంటీ అనే డౌట్ వస్తుంది కదా..మూడు కిలోల బరువుండే ఈ హెవీ కాస్ట్లీ బర్గర్‌ 15 సెంటీమీటర్ల ఎత్తు.. ఈ బ‌ర్గర్ మీద బంగారంతో పూత పూశారు. అంతేకాదు, జ‌పాన్‌కు చెందిన వాగ్యు అనే ఎద్దు మాంసం ముక్క‌లు, జ‌ప‌నీస్ వెన్న‌, బాతు కాలేయంతో త‌యారు చేసిన రుచిక‌ర‌మైన కూర‌, వెల్లుల్లిపాయ ర‌సం, ట‌మాట సాస్, పాల‌కూర‌, ట‌మాట ముక్క‌లు శాఫ్రాన్‌ సాస్‌ లు వంటివి ఉంటాయి. అంతేకాదు..బన్‌పైన షాంపేన్‌, రెడ్‌, వైట్‌ వైన్‌లను స్ప్రే చేసి కస్టమర్లకు సర్వ్‌ చేస్తారు.

ఎనిమిది మంది షెఫ్ లు ఈ బర్గర్‌ తయారు చేస్తారు. మరి మీరుకూడా ఈ బర్గర్‌ను టేస్ట్ చేయాలనుకుంటే మాత్రం మినిమమ్ త్రీ డేస్ ముందుగానే రిజర్వ్‌ చేసుకోవాలి. అంటే ఆర్డర్ చేసుకోవాలి. ముందుగా వ‌చ్చిన ఆర్డ‌ర్ల ప్ర‌కారం అందిస్తారు గ్రాండ్ హ‌య‌త్ హోటల్ షెఫ్ లు. మ‌రో విష‌యం ఏంటంటే, ఈ బ‌ర్గ‌ర్ ఒక్క‌టి తింటే, దాదాపు మూడు రోజుల దాకా ఇంకేమీ తినాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. అంటే మూడు రోజుల పాటు ఆక‌లి వేయ‌దు.ఈ బర్గర్ ఆర్డర్ చేస్తే.. దాంతో పాటు షాంపైన్ బాటిల్ ఫ్రీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *