హిమాచల్ లో లోయలో పడ్డ బస్సు

Bus accident In Himachal Pradesh

పర్యాటకులకు ఆహ్లాదకరమైన ప్రాంతం హిమాచల్ ప్రదేశ్ లో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని బిలాస్‌పూర్‌ జిల్లాలో పర్యాటకుల బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 26 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. మంగళవారం మనాలి నుంచి చండీగఢ్‌ వెళ్తున్న ఓ పర్యాటకుల బస్సు బిలాస్‌పూర్‌ జిల్లా స్వరఘాట్‌ ప్రాంతంలో అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. అయితే, అదృష్టవశాత్తు ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. వర్షాలు, విపరీతమైన మంచు కారణంగా ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. సహాయచర్యలు చేపట్టారు. 18 మందిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన మరో 8 మందిని చండీగఢ్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. హిమాచల్ ప్రదేశ్ లో ఎక్కువగా ఘాట్ రోడ్లే కావడంతో తరచుగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article