బస్ కండక్టర్ నుండి ఐపీఎస్ గా..

BUS CONDUCTOR BECOMES IPS OFFICER

స్ఫూర్తి ప్రదాత శివసుబ్రమణి 

జీవితంలో ఏదైనా సాధించాలి అంటే మన మధ్యలో లేని గొప్ప వాళ్లను ఆదర్శంగా తీసుకునే కంటే మన మధ్య లోనే ఉంటూ ఎన్నో కష్టనష్టాలకోర్చి ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారిని ఆదర్శంగా తీసుకుంటే మంచిది. అలాంటి స్ఫూర్తి ప్రదాతలు ఎందరో ఉన్నారు. అలాంటి వాళ్లలో ఒక బస్సు కండక్టర్ స్థాయి నుంచి ఐపీఎస్ అధికారిగా ఎదిగిన శివ సుబ్రమణి ఒకరు.

కష్టపడే స్వభావం ఉండాలే కానీ, అనుకున్న లక్ష్యం సాధించే పట్టుదల ఉండాలే కానీ ఆకాశమే హద్దుగా చూసుకోవచ్చు. అలా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన రియల్ హీరో శివ సుబ్రమణి. ఒక బస్సు కండక్టర్ గా ఉన్నా రజనీకాంత్ సూపర్ స్టార్ రజినీకాంత్ గా ఎలా ఎదిగాడో, అలా ఎదగడం వెనుక ఎంత కష్టంగా ఉంటుందో అందరికీ తెలుసు. అలాగే ఒక కళాశాలలో బస్సు డ్రైవర్ గా పనిచేసిన శివ సుబ్రమణి ఒక ఐపీఎస్ అధికారి గా మారడం వెనుక అతనిలో ఉన్న పట్టుదల, దృఢ సంకల్పం, దాని కోసం అతడు చేసిన కష్టం ఎంతటిదో ఇట్టే అర్థమవుతుంది. చాలా మంది జీవితంలో చాలా కోరికలుంటాయి.. కానీ వాటిని సాకారం చేసుకోవడానికి చేయాల్సిన పని సక్రమంగా చేయరు. కాని శివసుబ్రమణి తాను అనుకున్నది సాధించడం కోసం విశేషంగా కృషి చేశాడు .అసాధ్యం అనే పదం అతని డిక్షనరీలోనే లేదని తాను అనుకున్నది సుసాధ్యం చేసి చూపించారు. ముత్తాటూర్ (విల్లుపురం నుండి జింగీ) లోని వైకాఫ్ ఉన్నత మాధ్యమిక పాఠశాలలో చదువుకున్న శివ సుబ్రమణి చిన్నప్పటి నుండి చురుకైన విద్యార్ధి. ఆ తర్వాత కాలంలో ఆర్ధిక ఇబ్బందుల నేపధ్యంలో ఆయన ఎస్‌ఎస్‌ఎన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో బస్సు డ్రైవర్‌గా పనిచేసిన శివసుబ్రమణి ఐపిఎస్ అధికారిగా మారారు. యుపిఎస్సి పరీక్షలకు సిద్ధం కావడానికి దానికోసం శివ సుబ్రమణి ఎస్ఎస్ఎన్ లైబ్రరీ లో రోజంతా కూర్చుని చదివేవాడు. ఒకపక్క డ్రైవర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఆయన యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు. ఫలితంగా ఐపీఎస్ అధికారిగా తాను అనుకున్నది సాధించారు.ప్రస్తుతం, ఆయన ఒడిశాలోని బోలంగీర్ జిల్లాలో గ్రేహౌండ్స్ ఎస్పీగా పని చేస్తున్నారు.

ఇలాంటి వారే నిజమైన స్ఫూర్తిప్రదాతలు. కష్టాలను అధిగమించి, తాను అనుకున్నది సాధించడం కోసం అహర్నిశలు శ్రమించే పట్టుదల ఉన్న శివ సుబ్రమణి ఐపీఎస్ కు సెల్యూట్ చేద్దాం. ఆయన్నే ఇన్స్పిరేషన్ గా తీసుకొని లక్ష్యం వైపు గమనం ప్రారంభిద్దాం. కృషితో నాస్తి దుర్భిక్షం.

tags: shiva subramani, upsc, ips, odisha, bus driver

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *