ఎవరేం చేసినా సీఏఏ అమలు జరిపి తీరతామన్న కిషన్ రెడ్డి

CAA is not against any Indian citizen says Union minister G Kishan Reddy

ఎవరు ఎన్ని విఘాతాలు కల్గించినా , సీఏఏను ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే ప్రయత్నంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు .కావాలని ఈ చట్టం గురించి దుష్ప్రచారం చేసి లబ్ది పొందాలని చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు.  ఈ చట్టం ఏ ఒక్క భారతీయుడికి వ్యతిరేకం కాదని చెప్పారు.దేశంలోని శక్తులతోపాటు విదేశీ శక్తులు కలిసి మోదీ ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. సీఏఏ, ఎన్నార్సీపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు.
దేశ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై ఆయన మాట్లాడారు. యూపీలో పోలీసులపై కొంతమంది విధ్వంసకారులు డాడుల చేసిన ప్రస్తావనను ప్రస్తావిస్తూ.. పోలీసులకు రాజకీయాలతో సంబంధం లేదన్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం అమానుషమని అన్నారు. ‘పాక్, బంగ్లాదేశ్ లో ఉన్న మైనార్టీల రక్షణ కోసం చట్టం తీసుకొచ్చాం. పాక్, బంగ్లాను ఇస్లామిక్ దేశాలుగా మార్చారు. పాకిస్థాన్ లో మైనారిటీల జనాభా మూడు శాతానికి పడిపోయింది. పాక్ లో మైనారిటీలంతా ఏమయ్యారు? చాలా మందిని హత్య చేశారు. అలాంటి వారిని ఆదుకోవడానికే మన్మోహన్ సింగ్ హయాంలో చట్టం తేవడానికి ప్రయత్నించారు. కానీ, కార్యరూపం దాల్చలేదు. బీజేపీ ప్రభుత్వం 2015లోనే ఈ చట్టాన్ని ప్రవేశపెట్టింది. అప్పుడు, రాజ్యసభలో మెజారిటీ లేని కారణంగా ఆమోదం పొందలేకపోయింది’ అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.బీహర్లో నిరసనల సందర్భంగా 280 మంది పోలీసులకు గాయాలయ్యాయని. హింసలో పాల్గొన్న ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. హింసాత్మక దాడిలో పాల్గొన్న వారి నుంచే నష్ట పరిహారం వసూలు చేస్తామని అన్నారు. మొత్తానికి దేశంలో ఎవరు ఎంత వ్యతిరేకత తెలిపినా సీఏఏ అమలు చేసి తీరతామని కిషన్ రెడ్డి గట్టిగా చెప్పారు.

CAA is not against any Indian citizen says Union minister G Kishan Reddy,CAA, NRC, Central minister, Kishan reddy,  CAA awareness prograame

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article