సంక్షేమ పథకాలు ఓట్లు తెచ్చేనా?

176
CAN YSRCP WIN IN LOCAL POLLS
CAN YSRCP WIN IN LOCAL POLLS

CAN YSRCP WIN IN LOCAL POLLS

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల సమరానికి రంగం సిద్ధమైంది. ఈ ఎన్నికల్లో కచ్చితంగా భారీ విజయం నమోదు చేస్తామని అధికార వైసీపీ ఘంటాపథంగా చెబుతోంది. తమ సంక్షేమ పథకాలే తమకు ఓట్లు తెచ్చిపెడతామని ధీమా వ్యక్తంచేస్తోంది. మరి క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి ఉందా అనేది స్పష్టంగా తెలియడంలేదు. సంక్షేమ పథకాలే ఓట్లు తెచ్చిపెడతాయనే ధీమా ఉంటే.. ఎన్నికల్లో తేడా వస్తే పదవులు ఊడిపోతాయంటూ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎందుకు వార్నింగ్ ఇస్తున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. నిజానికి ప్రజా క్షేత్రంలో ప్రస్తుతం వైసీపీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక కొరత, పింఛన్ల కోత, అన్న క్యాంటీన్ల ఎత్తివేత వంటి అంశాలు అధికార పార్టీకి ప్రతికూలంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. పైగా స్థానిక పోరులో చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. వీటన్నంటినీ అధిగమించి ఓట్లు రాబట్టుకోవలసి ఉంటుంది. అధికారంలో ఉండటం వైసీపీకి కాస్త కలిసొచ్చే అంశమే. పైగా అమ్మ ఒడి, ఇంటిదగ్గరకే పింఛన్లు, ఉగాదికి భారీగా ఇళ్ల స్థలాల పంపిణీ వంటి విషయాలు ఆ పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది.

అయితే, గ్రామస్థాయిలో వైసీపీలో ఉన్న వర్గపోరు అధికార పార్టీగా తలనొప్పిగా మారనుందనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఆయా విషయాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. అలాగే మొన్నటి ఎన్నికల్లో పార్టీగా వెన్నుదన్నుగా నిలిచిన బీసీల ఆదరణ పొందితే స్థానిక సమరంలో వైసీపీకి తిరుగు ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలా కాకుండా స్థానిక సమస్యలు, ప్రభుత్వ వ్యతిరేకత పనిచేస్తే మాత్రం ఇబ్బంది తప్పదని అంటున్నారు. మొత్తానికి ప్రభుత్వ 9 నెలల పాలనకు రెఫరెండంగా భావిస్తున్న ఈ ఎన్నికలు అటు అధికార పక్షానికి, ఇటు ప్రతిపక్షాలకు ప్రతిష్టాత్మకంగా మారాయి.

AP POLITICS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here