అపర్ణా సరోవర్ రెసిడెంట్స్ వినూత్న ఆలోచన

APARNA SAROVAR RESIDENTS INNOVATIVE IDEA.. THEY CONVERED FOUR WHEELER INTO A SHIFT AMBULANCE.

392
కారు ఫిఫ్ట్ ఆంబులెన్సుగా మారెన్ 

ఆపదలో తోటివారిని ఆదుకోవాలనే ఆలోచనలుంటే చాలు.. ఎలాగైనా చేయవచ్చు. మన వల్ల ఏం జరుగుతుంది? మనమేం చేయగలం? అని ఆలోచించుకుని కూర్చుంటే ఎప్పటికీ సాయం చేయలేం. కానీ, ఈ ఐదుగురు యువకులు కాస్త వినూత్నంగా ఆలోచించారు. కరోనా సమయంలో ఎలాగైనా ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని భావించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. కారును షిఫ్ట్ ఆంబులెన్స్ గా మార్చివేసి అందులో ఆక్సిజన్ కాన్సెన్ ట్రేటర్ కూడా ఏర్పాటు చేశారు. ఇంకేముంది.. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నారు. ఈ వినూత్నమైన ఆలోచనకు శ్రీకారం చుట్టినవారెవరో తెలుసా? మెహల్ మోహతా, శేషు కావలిపురపు, నాగరాజు గులిశెట్టి, సయంతన్ బోస్, రాహుల్ మోహతా.. వీరంతా నలగండ్లలోని అపర్ణా సరోవర్ గేటెడ్ కమ్యూనిటీలో నివసిస్తున్నారు. కరోనా సమయంలో ఆపన్నహస్తం అందించడానికి ముందుకొచ్చిన వీరిని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనర్ ప్రత్యేకంగా అభినందించారు. వీళ్లు చేసిన మంచి పనిని సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి కృష్ణ ఏదుల వెలుగులోకి తెచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here