కారు గుర్తుతో నష్టపోయాను

CAR SYMBOL DAMAGED ME ALOT

ఎన్నికల్లో అభ్యర్థులకు కేటాయించే గుర్తులు ఎంత కీలకమో మనకు తెలిసిందే. ఓటర్లకు అభ్యర్థి ఎవరనేది గుర్తుండదు. కానీ తమ పార్టీ గుర్తు మాత్రం మరచిపోరు. అందువల్లే ప్రచారంలో మన గుర్తు ఇదీ, మీ ఓటు ఈ గుర్తుకే వెయ్యాలంటూ హోరెత్తిస్తారు. గుర్తును పోలిన గుర్తు ఉండటంతో ఇటు పడాల్సిన ఓట్లు అటు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే గుర్తు విషయంలో పార్టీలు చాలా జాగ్రత్త తీసుకుంటాయి. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ ఫార్వర్డ్ బ్లాక్ కు కేటాయించిన ట్రక్కు గుర్తు కారణంగా తాము చాలా నష్టపోయామని టీఆర్ఎస్ పేర్కొన్న సంగతి తెలిసిందే. కారును పోలి ఉన్న ట్రక్కుకు చాలామంది పొరపాటున ఓటేశారని, ఆయా నియోజకవర్గాల్లో ట్రక్కుకు వచ్చిన ఓట్లే ఇందుకు నిదర్శనమని టీఆర్ఎస్ పేర్కొంది. తదుపరి ఎన్నికల్లో తెలంగాణలో ఎవరికీ ట్రక్కు గుర్తు కేటాయించొద్దని ఎన్నికల సంఘానికి విన్నివించింది.

కాగా, తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు తొలగించాలంటూ సమాజ్ వాదీ ఫార్వర్డ్ బ్లాక్ ఎన్నికల సంఘాన్ని కోరింది. తమ గుర్తు ట్రక్కును పోలి ఉన్న కారణంతో చాలా మంది ఓటర్లు పొరపాటున కారుకు ఓటేశారని, అందువల్ల టీఆర్ఎస్ కు కారు గుర్త తొలగించాలని విన్నవించింది. ఈ మేరకు గద్వాల్ నుంచి పోటీ చేసిన ఓడిపోయిన సమాజ్ వాదీ ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి అబ్దుల్ మహ్మద్ తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ కి వినతిపత్రం సమర్పించారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీకి కారు గుర్తుని తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే.. అప్పుడు కూడా చాలా మంది అభ్యర్థులు తనలాగే నష్టపోతారని పేర్కొన్నారు. దీనిపై ఎన్నికల సంఘం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

TS POLITICS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article