కల్లాల కాడికి కార్గో బస్సులు

46
Cargo buses supply rice bags
Cargo buses supply rice bags

Cargo buses supply rice

ఆర్టీసీని లాభాల పట్టించేందుకు అధికారులు డిఫరెంట్ పద్ధతులను పాటిస్తున్నారు. తాజాగా తెలంగాణ ఆర్టీసీ అధికారులు ఇంకోఅడుగు ముందుకొశారు. ఇప్పటికే వస్తు రవాణలో ఇప్పటికే కార్గోబస్సులను ప్రవేశపెట్టింది. తాజాగా ఈ కార్గో బస్సులను వ్యవసాయ ఉత్పత్తులను తరలిచేందుకు ప్లాన్ చేస్తోంది. కార్గో బస్సులను బుక్ చేసుకుంటే నేరుగా కల్లాల కాడికే బస్సులు వస్తాయి. ధాన్యాన్ని బస్సులో నింపుకొని వ్యవసాయ మార్కెట్ కు తరలిస్తాయి. తక్కువ ధరకే రైతులు కార్గో బస్సులు పొందేలా చర్యలు తీసుకోబోతోంది.

గతంలో రైతులు తమ ధాన్యాన్ని ఎండ్ల బండ్లలో తరలించేవారు. దాంతో వాన భయం ఉండేది. ఎదురుచూపులు కూడా ఉండేవి. ఆ తర్వాత లారీలు, ట్రాక్టర్లలో తరలించేవారు. సమయానికి అవి అందుబాటు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ ఇబ్బందులను రైతులు త్వరలో అధిగమించనున్నారు. కార్గో బస్సు బుక్ చేసుకుంటే తమ వరిని భయం లేకుండా హాయిగా వ్యవసాయ మార్కెట్, మిల్లలకు తరలించుకోవచ్చు. ఇది నిజంగా రైతులకు గుడ్ న్యూస్ లాంటిదే కదా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here