
Case against Vasavi Green
కీసర మండలం బొమ్మరాస్ పేటలో వాసవి గ్రీన్ లీఫ్ వెంచర్స్ లో అటవీ శాఖ అనుమతులు లేకుండా చట్టవిరుద్ధంగా చెట్లను నరికేశారు. దీంతో, అక్కడికి చేరుకున్న కీసర అటవీ శాఖ అధికారులు వాల్టా యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. కీసర ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అఫ్రోజ్, డీఎఫ్ వో వెంకటేశ్వరులు దర్యాప్తును ప్రారంభించారు. వాసవి సంస్థపై దాదాపు రూ.50 లక్షల జరిమానా పడే అవకాశం ఉందని అటవీ శాఖ అధికారులు తెలిపారు.