ఎడిటర్ పై దాడి కేసులో నెల్లూరు ఎమ్మెల్యే పై కేసు

Case Booked Against Nellore MLA SridharReddy

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. గతంలో ఒక జర్నిలిస్టును బెదిరించిన వ్యవహారంలో ఆయనను టీడీపీ అధినేత మొదలు ప్రతిపక్షం పెద్ద ఎత్తున నిలదీసింది. ఇప్పుడు ఏకంగా పత్రికా ఎడిటర్ పైనే దాడి చేసారని జమీన్ రైతు పత్రిక ఎడిటర్ ఆరోపిస్తున్నారు. కొద్ది కాలంగా ఈ పత్రికలో ఎమ్మెల్యే కోటంరెడ్డి కి వ్యతిరేకంగా వార్తలు వస్తున్నాయి. దీంతో..పత్రిక .. ఎమ్మెల్యే మధ్య వివాదం నడుస్తోంది. దీనిలో భాగంగానే తాజాగా దాడి జరిగినట్లు చెబుతున్నారు. పత్రిక ఎడిటర్ వీడియో విడుదల చేసారు. కోటంరెడ్డి మీద తీవ్ర ఆరోపణలు చేసారు. ఏకంగా ముఖ్యమంత్రితో కాదు ఎవరితో నైనా చెప్పుకో అంటూ ఎమ్మెల్యే బెదిరిస్తూ దాడి చేసారని పత్రిక ఎడిటర్ ఆరోపిస్తున్నారు.
నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయన అనుచరులపై ఈ వ్యవహారంలో పోలీస్ కేసు నమోదైంది. నిన్న రాత్రి కోటంరెడ్డి సహా ఆయన అనుచరులు తన ఇంటిపై దాడి చేశారని జమీన్ రైతు వారపత్రిక అధినేత డోలేంద్ర ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెల్లూరులోని దుర్గామిట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. చట్ట ప్రకారం ఈ కేసును విచారిస్తామని పోలీసులు తెలిపారు. ఈ దాడి ఘటన గురించి తెలుసుకున్న నెల్లూరు మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ తదితరులు డోలేంద్ర ప్రసాద్ ను పరామర్శించారు. కాగా, వేదాయపాలెంలోని డోలేంద్ర ప్రసాద్ ఇంటిపై ఈ దాడి జరిగినట్టు చెబుతున్నారు.

TOMATA RATE IN PAK INCREASE

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article