అసదుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు

CASE ON ASAD
సీఏఏ కు వ్యతిరేకంగా సభలు , సమావేశాలు నిర్వహిస్తూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్న ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు చేశారు హైదరాబాద్ పోలీసులు. ఇటీవల కర్ణాటకలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినందుకు , మత విద్వేషాలు రెచ్చగొట్టినందుకు ఆయనపై కేసు నమోదయ్యైంది.  నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు ఆయనపై ఓల్డ్‌ సిటీలోని మొగల్‌పుర పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అసదుద్దీన్ ఒవైసీతో పాటు.. ఎంఐఎం మాజీ ఎమ్మెల్యే వారిస్ పఠాన్‌పై కూడా కేసు ఫైల్ చేశారు. కాగా, సీఏఏ, ఎన్‌ఆర్సీకి వ్యతిరేకంగా జరుగుతోన్న ఆందోళన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు అసదుద్దీన్ ఒవైసీ..
దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తోన్న నిరసన కార్యక్రమాల్లో పాల్గొని ఆయన ప్రసంగాలు చేస్తున్నారు. అయితే, ఇటీవలే కర్ణాటకలో ఎన్‌ఆర్సీ, సీఏఏకు వ్యతిరేకంగా నిర్వహించిన సభలో పాల్గొన్న అసదుద్దీన్.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు భారతీయ జనతా పార్టీ నేతకి చెందిన ఢిల్లీ నేత కపిల్ మిశ్రా… దీంతో అసదుద్దీన్ ఒవైసీ, వారిస్ పఠాన్‌పై కేసు నమోదు చేయాలంటూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో, ఆ ఇద్దరిపై మొగల్‌పురా పోలీసులు ఐపీసీ అండర్ సెక్షన్ 153, 153(ఏ), 117, 295-ఏ, 120బీ కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే సీఏఏ విషయంలో మత విద్వేషాలతో ఢిల్లీలో  మారణ కాండ జరిగిన విషయం తెలిసిందే .ఇక దానితో అప్రమత్తమైన ప్రభుత్వం ఎవరైనా మత విద్వేషాలు రెచ్చగొడితే తగిన మూల్యం చెల్లించాలని చెప్తోంది.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article