సి.కల్యాణ్ పై కేసు నమోదు

135
Case registered on Producer C Kalyan
Case registered on Producer C Kalyan

షేక్‌పేట భూవివాదంపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సినీ నిర్మాత సి.కల్యాణ్ తో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదైంది. అమెరికాలో వైద్యుడిగా పని చేస్తున్న స్వరూప్‌.. 1985లో షేక్‌పేటలో ఫిలింనగర్‌ హౌసింగ్‌ సొసైటీ నుంచి భూమి కొనుగోలు చేశాడు. 2015లో నారాయణమూర్తి అనే వ్యక్తికి లీజుకు ఇచ్చాడు. నారాయణమూర్తి ఆస్థలంలో ఆర్గానిక్‌ స్టోర్‌ నడుపుతున్నాడు. అయితే నిన్న సాయంత్రం నిర్మాత సి.కల్యాణ్‌ పంపిస్తే వచ్చామని.. షరూఫ్‌, శ్రీకాంత్‌, తేజస్వి కలిసి ఆర్గానిక్‌ స్టోర్‌కు తాళాం వేశారు. స్వరూప్‌ సోదరుడు ఫిర్యాదు చేయడంతో వీరి ముగ్గురితోపాటు సి.కల్యాణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here