జగన్ పై దాడి కేసులో ఎన్ఐఏ చార్జ్ షీట్ లో కీలకాంశాలు ఇవే

CBI Charge Sheet On YS Jagan Attack

జగన్ పై కోడి కత్తి దాడి కేసును ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణ చేస్తున్నప్పటికీ కేంద్రం ఎన్ఐఏ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే జగన్ కేసును విచారించిన ఎన్ఐఏ ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేసింది. వైసీపీ అధినేత జగన్‌పై దాడి కేసుకు సంబంధించి ఎన్ఐఏ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. సిట్ రిపోర్ట్ తో ఎన్ఐఏ దాదాపు ఏకీభవించింది. దాడి కేసులో శ్రీనివాసరావే సూత్రధారి , పాత్రధారి అని నిర్ధారించింది. జగన్‌‌పై కోడికత్తితో చేసిన దాడి ఉద్దేశ పూర్వకంగా జరిగిందేనని జాతీయ దర్యాప్తు సంస్థ తేల్చింది. వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై జరిగిన కోడి కత్తి దాడి కేసులోఎన్‌ఐఏ చార్జిషీట్‌లో పలు అంశాలు పేర్కొంది. సిట్‌ రిమాండ్ రిపోర్ట్‌లోని అంశాలనే ఎన్‌ఐఏ కూడా చెప్పింది. వై.ఎస్‌. జగన్‌పై గత ఏడాది అక్టోబర్‌ 25న విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఉద్దేశ పూర్వకంగా జరిగిందేనని జాతీయ దర్యాప్తు సంస్థ స్పష్టం చేసింది. జగన్‌పై జరిగిన దాడిని ఏపీ పోలీసులు హత్యాయత్నంగా పరిగణిస్తూ, ఐపీసీ సెక్షన్‌ 307 కింద కేసు నమోదు చేయగా ఎన్‌ఐఏ కూడా ఇదే సెక్షన్ కింద శ్రీనివాస్ రావ్‌పై అభియోగాలు నమోదు చేసింది. గత అక్టోబర్‌ 25న విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడి ఘటనను అంతకు ముందు రోజు శ్రీనివాసరావు చేసిన కార్యకలాపాల గురించి ఎన్ఐఏ చార్జిషీట్‌లో సమగ్రంగా వివరించింది. జగన్‌పై దాడి చేసే ముందు రోజు ఎయిర్‌పోర్టు ఫుడ్ కోర్టులో తోటి ఉద్యోగులతో జగన్‌ గురించి శ్రీనివాసరావు చర్చించినట్లు తెలిపింది. జగన్‌తో సెల్ఫీ తీసుకునే అవకాశం ఇవ్వాలని సహా ఉద్యోగి హేమలతను శ్రీనివాసరావు కోరాడని చెప్పింది. ఇందుకోసం వైసీపీలో ఎవరితోనైనా మాట్లాడాలని హేమలతను కోరగా సెల్ఫీ దిగేలా తాను చూస్తానని ఆమె భరోసా ఇచ్చినట్లుగా వివరించింది. పార్టీ నేతలతో కలిసి జగన్‌ వీఐపీ లాంజ్‌లో ప్రవేశించాక వారికి అల్పాహారం అందించేందుకు శ్రీనివాసరావు ఫుడ్‌ కోర్టు సిబ్బందితో కలిసి లోనికి వెళ్లినట్లుగా చార్జిషీట్లో స్పష్టం చేసింది. సెల్ఫీ పేరుతో జగన్‌తో మాటలు కలిపిన శ్రీనివాసరావు సర్ మన పార్టీ 160 సీట్లు గెలుస్తుంది అని చెబుతూనే జేబులో నుంచి కోడికత్తి తీసి దాడి చేశారని ఎన్ఐఏ వివరించింది. కత్తి దాడి కారణంగా జగన్ ఎడమ భుజంపై గాయం అయిందంటూ డాక్టర్లు ఇచ్చిన నివేదికను కూడా ఎన్ ఐఏ తన చార్జ్ షీట్ లో ప్రస్తావించింది

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article