31న  సీబీఐ కోర్టుకు హాజరవ్వాల్సిందే…

147
CBI court orders CM YS Jagan to attend January 31
CBI court orders CM YS Jagan to attend January 31

CBI court orders CM YS Jagan to attend January 31

ఏపీ సీఎం  జగన్ అక్రమాస్తుల కేసులో ఈ నెల 31న కోర్టుకు హాజరవ్వాల్సిందేనని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. హాజరు కాకపోతే తగిన ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ముఖ్యమంత్రిగా ముఖ్యమైన సమావేశంలో పాల్గొనాల్సి ఉండటంతో జగన్ వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాది పిటీషన్ దాఖలు చేసారు. అయితే దీనిపై సీరియస్ అయిన న్యాయమూర్తి  దీనిని పరిశీలించిన న్యాయమూర్తి ప్రతీవారం ఏదో ఒక కారణం చెబుతారని..ఈ నెల 31న హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పారు. ఇక.. రిటైర్డ్‌ ఐఏఎస్‌ మన్మోహన్‌సింగ్‌పై అవినీతి నిరోధక చట్టం కింద ప్రాసిక్యూట్‌ చేసేందుకు కేంద్రం అనుమతించిందని సీబీఐ స్పెషల్‌ పీపీ సురేందర్‌ నివేదించారు. రాష్ట్రప్రభుత్వ అనుమతితో సంబంధం లేదని స్పష్టం చేశారు. జగన్‌ కంపెనీల్లో వాన్‌పిక్‌ పెట్టుబడుల కేసులో నిందితుడిగా ఉన్న రిటైర్డ్‌ ఐఏఎస్‌ మన్మోహన్‌సింగ్‌పై అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్టు) కింద ప్రాసిక్యూట్‌ చేసేందుకు కేంద్రం అనుమతించిందని పేర్కొన్నారు. ఇక ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేదని చెప్పారు. ఇక  ఆయనతో న్యాయమూర్తి ఏకీభవించారు. మన్మోహన్‌పై పీసీ యాక్టు కింద అభియోగాలను విచారణకు స్వీకరించారు. . సీబీఐ కోర్టు తాజా ఆదేశాలతో ఈ నెల 10న కోర్టు ముందుకు వచ్చిన జగన్ , తిరిగి ఈ నెల 31న మరోసారి  కచ్చితంగా హాజరు కావాల్సి ఉంది.

CBI court orders CM YS Jagan to attend January 31,cbi special court,  hyderabad , ys jagan mohan reddy , ap cm , friday , personal attendence , man mohan singh

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here