సీబీఐ కు సుప్రీం లో చుక్కెదురు

CBI Faced problems in Supreme Court… ఆధారాలేవి అన్న సుప్రీం

కోల్ కతా ఘటనకు సంబంధించి సీబీఐ అధికారులకు సుప్రీంలో ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం(ఫిబ్రవరి-3)శారదా చిట్ ఫండ్ స్కామ్ కేసు దర్యాప్తుకి సంబంధించి కోల్ కతా సీపీని ప్రశ్నించేందుకు వెళ్లిన సీబీఐ అధికారుల బృందాన్ని బెంగాలు పోలీసులు అదుపులోకి తీసుకొని ఆ తర్వాత విడిచిపెట్టిన సందర్భంగా సోమవారం(ఫిబ్రవరి-4) ఈ కేసులో తక్షణ విచారణ చేపట్టాలన్న సీబీఐ అభ్యర్థనను చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ తప్పుబట్టారు. పిటిషన్ విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.
సీబీఐ అధికారులను బెంగాల్ పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేశారని సీబీఐ తరపున సొలిటర్ జెనరల్ తుషార్ మెహతా సుప్రీంలో వాదనలు వినిపించారు. కోల్ కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ లొంగిపోయేలా ఆదేశాలివ్వాలని కోరారు. విచారణ అధారాలను రాజీవ్ కుమార్ నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై స్పందిచిన చీఫ్ జస్టిస్..ఆధారాలు ఉంటే చూపించాలని సీబీఐని ఆదేశించారు. రాజీవ్ కుమార్ పై ఆరోపణలకు సంబంధించి ప్రస్తుతం ఎలాంటి రుజువులు లేనందున ఈ కేసుని మంగళవారానికి విచారించనున్నట్లు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article