రాయపాటి ఇల్లు ఆఫీసులపై సీబీఐ దాడులు

113
CBI Raids On Rayapati House And Offices
CBI Raids On Rayapati House And Offices
CBI Raids On Rayapati House And Offices

ఏపీలో టీడీపీ నేతలు వైసీపీ అధికారంలోకి వచ్చిననాటి నుండి ఎప్పుడేం జరుగుతుందో అన్న భయంలో ఉన్నారు. ఇక తాజాగా మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇల్లు, ఆఫీసుల్లో ఏక కాలంలో సీబీఐ అధికారులు దాడులు నిర్వహించడం కలకలం రేపింది. మంగళవారం ఉదయం నుంచి సీబీఐ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు.రాయపాటి చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ తో పాటు పలు కంపెనీల్లో సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ విజయవాడ గుంటూరు ఢిల్లీలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి.300 కోట్ల రూపాయల బ్యాంకు నుంచి రుణం తీసుకున్న రాయపాటి సాంబశివరావు బ్యాంకులకు రుణం చెల్లంచకుండా ఎగ్గొట్టడంతో ఆయనపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇండియన్ బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదు లో భాగంగా ఈ సోదాలు చేస్తున్నట్టు తెలిసింది. రాయపాటి తోపాటు ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ సీఈవో లో ఎండీ ఆస్తులపై కూడా సోదాలు నిర్వహిస్తోంది. బ్యాంక్ లను మోసం చేసిన వ్యవహారం లో రాయపాటి సాంబశివరావుపై  గతం లోనే సీబీఐ కేసు నమోదైంది. ట్రాన్స్ ట్రాయ్ ఎండీ చెరుకూరి శ్రీధర్ ఇంట్లో సైతం సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి.పోలవరం పనుల్లో ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ భాగస్వామిగా ఉంది. గతంలో బ్యాంకులకు బకాయి ఉన్న నేపథ్యంలో కేసు కూడా నడుస్తోంది. సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నిన్న టీడీపీ ఎమ్మెల్యే గిరి పార్టీ వీడిన తర్వాత.. ఇవాళ రాయపాటి నివాసంలో సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. ఉదయం 6 గంటలకే వచ్చిన సీబీఐ బృందాలు.. ఇంకా సోదాలు చేస్తోంది. సోదాల సమయంలో రాయపాటి హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉన్నారు. గుంటూరులో ఆయన కుమారుడు రంగబాబు ఉన్నారు.

tags : TDP, Rayapati Sambasivarao, Guntur, CBI Raids, Transtrai Company, Polavaram

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here