ఏపీ సర్కారుపై చంద్రబాబు ఫైర్

CBN FIRED ON AP GOVT

ఏపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత నిప్పులు చెరిగారు. ఏం చేసినా అడిగేవాళ్లు లేరనుకుంటున్నారా అని మండిపడ్డారు. ఉద్యోగులను తొలగించడం ఎందుకు? మళ్లీ కొత్తవాళ్లను నియమించడం ఎందుకు అని ప్రభుత్వాన్ని నిలదీశారు. పాతవారిని తీసేసి, మళ్లీ కొత్తవారిని తీసుకుని వాటికే ఉద్యోగాల కల్పన అని పేరు పెట్టుకోవడం ఏమిటో అర్థం కావడంలేదని పేర్కొన్నారు. ఔట్ సోర్సింగ్  ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామంటూ ఎందుకు హామీలిచ్చారని ప్రశ్నించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని.. గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల్లో తమకే ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఏఎన్‌ఎంలు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఆందోళన పలు చోట్ల ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెలిసిందే. ఏఎన్‌ఎంల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై చంద్రబాబు మంగళవారం ట్విటర్‌లో స్పందించారు.

‘‘ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళను తీసేసి, కొత్తవాళ్ళను తెచ్చుకోవడం, వాటికే ఉద్యోగాల కల్పన అని పేరుపెట్టుకోవడం ఏం పిచ్చిపనో నాకర్థం కావడం లేదు. అలాంటప్పుడు ఔట్ సోర్సింగ్ వాళ్ళను పర్మినెంట్ చేస్తామని హామీలు ఎందుకిచ్చినట్టు? మీ మాటలు నమ్మి, మిమ్మల్ని గెలిపించి, ఈరోజు ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడిగితే మహిళలని కూడా చూడకుండా ఇంత దారుణంగా, కర్కశంగా వ్యవహరిస్తారా? అడిగేవాళ్ళు లేరనుకుంటున్నారా? ఒక్క ఉద్యోగం ఊడగొట్టకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తోంది తెలుగుదేశం. ప్రజలు కష్టాలు చెప్పుకోడానికి సీఎం దగ్గరికి వస్తుంటే ముఖ్యమంత్రి నివాసం చుట్టూ 144 సెక్షన్ పెట్టుకుంటారా? ఇది ముఖ్యమంత్రి ఇల్లా? లోటస్ పాండ్ లాంటి ప్రైవేటు రాజభవనమా?’’ అని బాబు మండిపడ్డారు.

AP POLITICS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article