టీఆర్ఎస్ కు డమ్మీగా జగన్

CBN FIRED ON JAGAN

  • వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు కేసీఆరే
  • టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మరోసారి వైఎస్సార్ సీపీ, బీజేపీ, టీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. గత కొన్ని రోజులుగా ఈ మూడు పార్టీలను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేస్తున్న ఆయన.. తాజాగా శుక్రవారం కూడా అదే ఒరవడి కొనసాగించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఈ మూడు పార్టీలే కుట్రలు పన్నుతున్నాయని ధ్వజమెత్తారు. ఏపీ యువత ఉపాధికి గండికొట్టేందుకే ప్రయత్నిస్తున్నాయని దుయ్యబట్టారు. వైఎస్సార్ సీపీకి అధ్యక్షుడు కేసీఆర్‌ అని.. వైఎస్సార్ సీపీ, టీఆర్ఎస్ కు కేటీఆర్ సంయుక్త కార్యనిర్వాహక అధ్యక్షుడని ఎద్దేవా చేశారు. జగన్ టీఆర్ఎస్ కు డమ్మీగా మారిపోయారని పేర్కొన్నారు. తెలుగుతల్లిని అవమానించిన కేసీఆర్‌తో జగన్‌కు దోస్తీ ఏంటని ప్రశ్నించారు. ముందు కేసీఆర్‌ పెట్టుబడి పెడతారు.. తరువాత జగన్ కప్పం కడతారంటూ విమర్శించారు. శుక్రవారం చంద్రబాబు పార్టీ నేతలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్, వైఎస్సార్ సీపీపై పలు ఆరోపణలు చేశారు. ఆయా పార్టీలకు ప్రజలే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. టీడీపీ డేటా చోరీపై సిట్ ఏర్పాటైందని, ఓట్ల తొలగింపు కుట్రను కూడా ఛేదిస్తామని స్పష్టంచేశారు.

AP POLITICS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article