లక్ష కోట్లు కొట్టేసి.. 500 కోట్లు ఇస్తానంటారా?

Spread the love

CBN FIRED ON KCR

  • మీ భిక్ష నాకేమీ వద్దు.. నేనే రూ.500 కోట్లిస్తా
  • కేసీఆర్ పై చంద్రబాబు ఫైర్

తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఏపీ సీఎం చంద్రబాబు మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్న చంద్రబాబు తాజాగా గురువారం అనంతపురం జిల్లా పుట్టపర్తిలో జరిగిన సభలోనూ టీఆర్ఎస్ అధినేతపై విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చూసి ఆయన ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. అభివృద్ధిని అడ్డుకోవడం కోసం జగన్ తో కలిసి కుట్రలు పన్నుతున్నారని ఆరోపణలు చేశారు. ‘‘అమరావతికి శంకుస్థాపన సమయంలో రూ.500 కోట్లు ఇద్దామని తెలంగాణ ప్రభుత్వం అనుకుందట. ప్రధాని రాజధానికి ఏమీ ఇవ్వకపోవడంతో తాను ఇస్తే బాగుండదని, అందువల్లే ఆ మొత్తం ఇవ్వలేదని కేసీఆర్ చెప్పారు. మీ భిక్ష మాకేమీ వద్దు. కావాలంటే నేనే తిరిగి రూ.500 కోట్లిస్తా’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

లక్ష కోట్లు కొట్టేసి మనకు రావాల్సిన వాటిని ఇవ్వకుండా అమరావతికి రూ.500 కోట్లు ఇస్తానని కేసీఆర్‌ అన్నారని విమర్శించారు. ‘మీ భిక్ష మాకేమీ వద్దు. నేనే రూ.500 కోట్లిస్తా. భవిష్యత్‌లో హైదరాబాద్‌ను అమరావతి మించిపోతుందని భావించి ఇప్పుడు జగన్‌తో కలిసి కుట్ర పన్నుతున్నారు. మోదీ, కేసీఆర్‌ ఇచ్చిన సొమ్మును జగన్ నియోజకవర్గానికి రూ.10 కోట్ల చొప్పున పంచారు’ అని చంద్రబాబు విమర్శలు చేశారు. అంతకుముందు నరసమ్మ అనే వృద్ధురాలితో బాబు ముచ్చటించారు. ఇలాంటి వారిలో ఆనందాన్ని చూసేందుకే రూ.200 ఉన్న పింఛనును రూ.2వేలు చేశానని చెప్పారు. వృద్ధాప్య పింఛనును రూ.3వేలకు పెంచుతానని మరోసారి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమెను సైకిల్ పై ఎక్కించుకుని ఫొటోలకు ఫోజిచ్చారు.

AP POLITICS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *