రైతుబంధుపై మాంద్యం దెబ్బ?

193
CEILING TO RAITHU BANDHU
CEILING TO RAITHU BANDHU

CEILING TO RAITHU BANDHU

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం పరిస్థితులు కనిపిస్తున్నాయి. వివిధ రంగాలు కుదేలవుతున్నాయి. ఈ ఎఫెక్ట్ తెలంగాణపైనా పడింది. పలు పథకాలకు నిధుల లేమి స్పష్టంగా కనిపిస్తోంది. పైగా కాళేశ్వరం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు కేంద్రం నుంచి సహకారం కూడా లభించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం రుణాలపైనే ఆ ప్రాజెక్టును నెట్టుకొస్తోంది. తాజాగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సైతం కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా రూ.10వేల కోట్లు రుణం తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇతర పథకాలకు నిధుల సర్దుబాటు కష్టమవుతోంది. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ బడ్జెట్ రూపకల్పన సందర్భంగా అధికారులకు నిర్దేశించారు. నిధుల కేటాయింపుపై జాగ్రత్తగా వ్యవహరించాలని సూచనలు చేశారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతుబంధు పథకంపైనా మాంద్యం దెబ్బ పడింది. ఈ పథకంలో కీలక సవరణలు చేయడానికి సర్కారు సన్నద్ధమవుతోంది. రైతుకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నప్పటికీ, కేవలం పది ఎకరాలకు మాత్రమే రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం అందించాలని యోచిస్తోంది. తద్వారా ఈ పథకం కింద కొంత మేర నిధులను ఆదా చేసి, వాటిని ఇతర పథకాలకు వెచ్చించాలని చూస్తోంది. ప్రస్తుతం రైతుబంధు పథకం కింద ప్రతి రైతుకూ ఎకరానికి రబీ, ఖరీఫ్ సీజన్లలో కలిపి రూ.8వేలు అందజేస్తోంది. ఈ రబీ, ఖరీఫ్ నుంచి ఆ మొత్తం రూ.10వేలకు పెంచనుంది. ప్రస్తుతం దాదాపు 54 లక్షల మంది ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారు. ఒకవేళ పది ఎకరాలకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేస్తే దాదాపు రూ.2వేల కోట్ల వరకు ఆదా అవుతుందని ఆర్థికశాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలోనే సర్కారు ఈ దిశగా ఆలోచిస్తోందని సమాచారం.

TS NEWS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here