ప్రేక్షకులు కావలెను…

207
Cenema Theatres Empty
Movie premiere event at cine theatre. Cinema white blank screen at dark movie hall interior with empty red seats vector background

Cenema Theatres Empty

అన్ లాక్ భాగంగా సినిమాహాళ్లు తెరుచుకున్నాయి. దేశవ్యాప్తంగా, రాష్ర్టవ్యాప్తంగా కొన్ని థియేటర్లు పాత సినిమాలను ప్రదర్శించాయి. థియేటర్ ఫుల్ అవుతుంది, మళ్లీ ఆదాయం వస్తందునుకున్న థియేటర్ యజమానులకు నిరాశే ఎదురైంది. కేంద్రం 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమాలు ప్రదర్శించుకోవచ్చని చెప్పినప్పటికీ, ప్రేక్షకులే దొరకడం లేదు. ఒక్క షోకు పదిమంది ప్రేక్షకులు మించడం లేదు. అసలు కొన్ని థియేటర్లు అయితే ఒకరిద్దరితో షోను ముగించేస్తున్నాయి. థియేటర్స్ కు ప్రేక్షకులు రాకపోవడంతో యాజమాన్యాలు షోలు కూడా రద్దు చేస్తోంది. కొత్త సినిమాల సందడి మొదలైతేనే సినిమాహళ్లు తెరుస్తామని అంటున్నాయి పలు యజమాన్యాలు.

థియేటర్ లో ఒక్క షో వేస్తే టికెట్టు, కరెంటు, బిల్లులు, అద్దె ప్రతిదీ లెక్కలు ఉంటాయి. ప్రేక్షకుల సంఖ్య పదిమందికి కూడా దాటడం లేదు. అంటే ఒక్క షోకు వెయ్యి రూపాయలు కూడా గిటుబాటు కూడా కావడం లేదు. ఈ పరిస్థితి నుంచి గటెక్కేందుకు మళ్లీ యజమాన్యాలు మీటింగ్ పెట్టకోనున్నట్లు సమాచారం.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here