ఎన్టీఆర్ కథానాయకుడిపై చిక్కులు పెడుతున్న సెన్సార్

Censor Board is Troubling for NTR BIOPIC “NTR KATHANAYAKUDU”

తెలుగు రాష్ట్రాల్లో ప్రభంజనం సృష్టించటానికి రాబోతున్న చిత్రం ఎన్టీఆర్ కథా నాయకుడు. నందమూరి తారక రామా రావు జీవితాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయతనంలో భాగం గా నందమూరి నటసింహం బాలయ్య నిర్మాతగా అలాగే ఎన్టీఆర్ గా నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే చాలా ఇబ్బందులను ఎదుర్కొంది. ఇక విడుదలకు సిద్ధం అవుతున్న తరుణంలో కూడా ఈ చిత్రానికి అడ్డంకులు రావటం చిత్ర యూనిట్ ను షాక్ కు గురి చేస్తోంది.
తెలుగు ప్రేక్షకుల అభిమాన హీరో నందమూరి తారక రామారావు జీవితకథను ఎన్టీఆర్ బయోపిక్ రూపంలో ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ రెడీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌లతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడగా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తెలుగు ప్రేక్షకులు.

అయితే ఈ సినిమాకు ఎప్పటికప్పుడు అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సెన్సార్ నుండి మరో అడ్డంకి ఎదురైనట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఇద్దరు పాత్రలను నెగెటివ్‌గా చూపించారని సెన్సార్ అడ్డు చెప్పినట్లు ఫిలింనగర్ టాక్. అయితే వారి దగ్గర్నుండి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తుందట. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు అనే టాపిక్‌పై అనేక వార్తలు వినిపిస్తుండగా.. వారు లక్ష్మీ పార్వతి మరియు నాదెండ్ల భాస్కర్ రావు అని తెలుస్తోంది. ఈ విషయంపై స్పష్టత లేకపోయినా, సినిమా రిలీజ్‌కు అడ్డంకిగా మారడంతో చిత్ర యూనిట్ కాస్త టెన్షన్ పడుతుంది. ఏదేమైనా ఎన్టీఆర్ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్‌ కానుండగా ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని కొందరు ఎదురు చూస్తుండగా.. ఎలాంటి వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తుందా అని క్రిటిక్స్ ఎదురు చూస్తున్నారు.

ఇటు ఈ సినిమా పై ఇండస్ట్రీ వర్గాల, రాజకీయ వర్గాల అలాగే ప్రజల ఆసక్తి చాలా వుంది. ఒక పక్క ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వస్తున్న ఈ సినిమా పై వైసీపీ వర్గాల్లో టెన్షన్ ,టీడీపీ శ్రేణుల్లో ఆనందం నెలకొంది. ఇక ఈ సినిమాను మొదట నుండి వ్యతిరేకిస్తున్న ఆ ఇద్దరి నుండి నో అబ్జెక్షన్ తీసుకురావటం సాధ్యమేనా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ .

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article