Telangana High Court send notice to Central election commission of India
కాంగ్రెస్ పార్టీ నేతలు ఇటీవల తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికలు అక్రమాలు జరిగాయంటూ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. చాలా మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. అయితే ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిందని, ఈవీఎంలలో పోలైన ఓట్ల కు, వీవీ ప్యాట్ ఫ్లిప్ లకు చాలా తేడా ఉందని కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో తమ పిటిషన్ ను దాఖలు చేశారు. దీంతో విచారించిన హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి ఝలక్ ఇచ్చింది.
కేంద్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గతేడాది డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్‌లను హైకోర్టు విచారించింది. కాంగ్రెస్ నేతలు మల్‌రెడ్డి రంగారెడ్డితో పాటు ఉత్తమ్ పద్మావతి, ధర్మపురి లక్ష్మణ్‌లు దాఖలు చేసిన పిటిషన్‌లను హైకోర్టు విచారించింది. పోలైన ఓట్లకు, వీవీ పాట్ ఓట్లకు తేడా ఉందంటూ మల్‌రెడ్డి రంగారెడ్డి తరపు న్యాయవాది వాదించారు. తన క్లయింట్ స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారని వీవీ పాట్‌ల ఓట్లకు పోలైన్ ఓట్ల భారీగా తేడా ఉందంటూ ఆయన వాదించారు. ఇదే సమయంలో ఇతరుల పిటిషన్లను కూడా విచారించిన హైకోర్టు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఈసీని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణ వచ్చే 14కు వాయిదా వేసింది.
Subscribe on youtube Channel