central govt pending ap new districts process
ఇటీవల ఢిల్లీ వరుస పర్యటనలు చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కేంద్రం ఒక విషయంలో వెయిట్ చెయ్యాలని చెప్పింది . ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హోం మంత్రి అమిత్ షా మరికొందరు కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు వివరించి కేంద్రం సహకరించాలని కోరారు. అయితే ఢిల్లీలో ఉన్నప్పుడే జగన్ కు ఓ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం చెప్పినట్టు తెలుస్తుంది . సీఎం జగన్ కొత్త జిల్లాలను ఏర్పాటు చెయ్యాలని నిర్ణయం తీసుకున్న నేపధ్యమో 2021 మార్చి 31వ తేదీ వరకు రాష్ట్రంలో ఎలాంటి మార్పులు చేయరాదని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా జాతీయ పౌర పట్టిక (ఎన్పీఆర్) చేపడుతుండడం తో మీరు చేపట్టాల్సిన కొత్త జిల్లాలను ఇప్పుడే వద్దని పరోక్షంగా తెలిపినట్లు తెలుస్తోంది. జాతీయ పౌర పట్టిక అంటే దేశంలోని జనాభా వివరాలన్నీ నమోదు చేయనున్నారు. దీంతో దేశంలోని జనాభా సమగ్ర వివరాలు సేకరించనున్నారు.
ఈ జనవరి 1వ తేదీ నుంచే అమలు చేస్తుండడంతో ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలు ఏర్పాటుచేస్తే వివరాల సేకరణ కు ఆటంకం ఏర్పడుతుందనే ఉద్దేశం తో కేంద్రం ఆ విధంగా ఆదేశించినట్లు తెలుస్తోంది. 2021 జనాభా లెక్కల్లో భాగంగా హౌసింగ్ లిస్ట్ ఆపరేషన్ తో పాటు ఎన్పీఆర్ ను అప్ డేట్ చేస్తున్నారు. దీంతో జగన్ చేపట్టాల్సిన ముఖ్యమైన హామీ అయిన కొత్త జిల్లాల ఏర్పాటుకు కొన్నాళ్లు ఆగాల్సిందే. కేంద్రం నిర్ణయం ప్రకారం ఒక ఏడాది కాలం కొత్త జిల్లాల ఏర్పాటు ఆగాల్సిందే. అంటే 2021 మార్చి 31వ తర్వాత జిల్లాల ఏర్పాటు చేసుకోవచ్చు.జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో చేపట్టిన సుదీర్ఘ పాదయాత్రలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటుచేస్తానని హామీ ఇచ్చారు. ఏపీలో ఉన్న 25 పార్లమెంట్ స్థానాలను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చెయ్యాలని భావించినా కేంద్ర నిర్ణయంతో అది కాస్త ఒక ఏడాది కాలానికి పెండింగ్ పడింది.
central govt pending ap new districts process,ap government , ycp, cm jagan mohan reddy,#jagan