Central Govt should Be Actions On Rajadhani Amaravati
ఏపీ రాజధాని మార్పు వద్దంటూ అమరావతి రైతుల దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ అంశంపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. ఏపీ విభజన చట్టం ప్రకారం రాజధాని బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి ఏపీ రాజధాని వ్యవహారాన్ని చక్కదిద్దాలని పవన్ అభిలషించారు. దీనిపై అఖిలపక్షం వేసి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. జనసేన కార్యాలయానికి వచ్చిన గుంటూరు జిల్లా నేతలతో పవన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాజధాని రైతులకు అన్యాయం జరగకూడదని అన్నారు. రాజధానిపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ అభిప్రాయం వెల్లడించాలని కోరారు.
రాజధానుల వ్యవహారం పైన జనసేన అధినేత పవన్ ఇక ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలని నిర్ణయించారు. ఇందు కోసం రైతులు..మద్దతుదారులతో కలిసి భారీ కవాతుకు నిర్ణయించారు. ఇప్పటికే పవన్ కొద్ది రోజు ల క్రితం అమరావతి రైతులకు సంఘీభావంగా అక్కడి గ్రామాల్లో పర్యటించిన సమయంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు అక్కడి రైతులు..అందులోనూ మహిళలు పెద్ద సంఖ్యలో ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో..తాను వారికి మద్దతుగా నిలిచి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని డిసైడ్ అయ్యారు. అందుకోసం ఈ నెల 18 లేదా 19వ తేదీల్లో పవన్ అమరావతి..విజయవాడలో కవాతు చెయ్యాలని నిర్ణయించారు. ఇప్పటికే పవన్ కొద్ది రోజు ల క్రితం అమరావతి రైతులకు సంఘీభావంగా అక్కడి గ్రామాల్లో పర్యటించిన సమయంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు అక్కడి రైతులు..అందులోనూ మహిళలు పెద్ద సంఖ్యలో ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో..తాను వారికి మద్దతుగా నిలిచి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని డిసైడ్ అయ్యారు. అందుకోసం ఈ నెల 18 లేదా 19వ తేదీల్లో పవన్ అమరావతి..విజయవాడలో కవాతుకు నిర్ణయించారు. దీని పైన ఇప్పటికే పార్టీ ముఖ్యనేతలు చర్చలు చేసారు. రూటు మ్యాప్ సిద్దం చేసి…శనివారం పవన్ అధ్యక్షతన జరిగే పార్టీ సమావేశంలో దీని పైన అధికారిక ప్రకటన చేయనున్నారు.