కేంద్రం జీఎస్టీ బకాయిలు వెంటనే చెల్లించాలి, తెలంగాణా ఎంపీల ఆందోళన

Central Should Pay GST Dues Immediately

తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటు ఆవరణలో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. కేంద్రం నుంచి తెలంగాణకు చెల్లించాల్సిన జీఎస్టీ బకాయిలు విడుదల చేయాలంటూ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ మేరకు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఇవేకాక రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సిన ఇతర నిధులను కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ ఉభయసభల్లో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటాను తక్షణం విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు నాలుగు రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. కేంద్రం నుంచి రాష్ట్రానికి జీఎస్టీ సహా ఇతర పన్నుల వాటా రూపేణా మొత్తం రూ.4,531 కోట్లు రావాల్సి ఉందని లేఖలో పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన విధంగా రాష్ట్రానికి పన్నుల వాటాను విడుదల చేయాలని లేఖలో సీఎం కేసీఆర్ కోరారు. నేడు పార్లమెంటు ఆవరణలో టీఆర్ఎస్ ఎంపీలు  తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హక్కులు కల్పించాలని ఆందోళన చేశారు.

TS POLITICS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article