ఏపీ రాజధానిపై మరోమారు కేంద్రం

100
entre Again Clarifies Wont Intervene 3 Capital Issue
entre Again Clarifies Wont Intervene 3 Capital Issue

Centre Again Clarifies Wont Intervene 3 Capital Issue

ఏపీ రాజధాని అంశంపై కేంద్ర ప్రభుత్వం  మరోమారు కుండ బద్దలు కొట్టింది. రాజధాని అంశం తమ పరిధిలోనిది కాదని తేల్చి చెప్పింది. ఇక ఏపీ రాజధానిపై పార్లమెంట్‌లో లిఖిత పూర్వకంగా స్పష్టతనిచ్చింది. రాజధానిపై నిర్ణయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనిదేనని పేర్కొంది. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా టీడీపీ ఎంపీ కేశినేని అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. రాజధాని ఏర్పాటుపై కేశినేని నాని వేసిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సమాధానమిస్తూ రాజధాని ఏర్పాటు నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనని చెప్పింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని స్పష‌్టం చేసింది. మరోసారి పార్లమెంటులో కేంద్రం రాజధానిపై స్పష్టత ఇచ్చినట్లయింది. అంతకు ముందు కూడా ఇదే విషయాన్ని కేంద్రం స్పష్టం చేసింది. 2015లో అప్పటి ప్రభుత్వం అమరావతిని ఏర్పాటు చేస్తే దాన్ని కేంద్రం నోటిఫై చేసిందని  కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ సమాధానం ఇచ్చారు.  మూడు రాజధానుల అంశంపై కూడా మీడియా ద్వారా తెలుసుకున్నామని ఆయన అప్పట్లో పేర్కొన్నారు. ఇక తాజాగా మరోమారు కేంద్రం రాజధాని విషయంలో కేంద్రం జోక్యం ఉండబోదని స్పష్టంగా చెప్పింది .

Centre Again Clarifies Wont Intervene 3 Capital Issue,ap capital ,#capitals

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here