ఏపీ రాజధానిపై కేంద్రం స్పందన .. ఏమందంటే

104
Centre can't interfere with AP Capital shifting
Centre can't interfere with AP Capital shifting

Centre can’t interfere with AP Capital shifting

ఏపీ రాజధానిపై  కేంద్రం స్పందించింది. రాజధాని అమరావతిపై అనిశ్చితి కొనసాగుతున్న తరుణంలో  కేంద్రం రాజధాని విషయంలో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది . అమరావతి సహా విశాఖపట్నం, కర్నూలు మూడు  రాజధానులుగా వైసీపీ ప్రభుత్వం పేర్కొనడంతో నిరసన జ్వాలలు ఏపీలో కొనసాగుతున్నాయి . ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లోక్ సభలో రాజధాని గురించి ప్రశ్నించారు. దీనిపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ స్పష్టత ఇచ్చారు.

ఏపీలో మూడు రాజధానుల అంశం తమకు మీడియా కథనాల ద్వారానే తెలిసిందని వెల్లడించారు. అయితే రాష్ట్ర పరిధిలో రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలన్న రాష్ట్రం ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుందని, రాజధానిని ఎక్కడైనా ఏర్పాటు చేసుకునే అధికారం రాష్ట్రానికి ఉందని నిత్యానంద రాయ్ తన లిఖితపూర్వక సమాధానంలో వివరించారు. అయితే, గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ రాజధానిగా అమరావతిని నోటిఫై చేసిందని, దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు కూడా వచ్చాయని తెలిపారు.

nithyananda royCentre can’t interfere with AP Capital shifting,AP capital, capital amaravati, three capitals,#

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here