- అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్
ఇండియన్ ఆరిజిన్ ఉమెన్స్ ఫోరమ్
గర్భాశయ కేన్సర్ పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఉఫ్ ఇండియన్ ఆరిజాన్ ఉమెన్స్ ఫోరమ్ సూచించింది. ప్రతి మహిళా తప్పకుండా కేన్సర్ రాకుండా వాక్సిన్ వేయుంచుకోవాలని కోరింది. ప్రస్తుతం మహిళలపై జరుగుతున్న వేధింపులను అరికట్టడంలో పాటు మహిళా సాధికారత, హక్కులను ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఫోరమ్ కోరింది. నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ప్రతి మహిళ తమ కుటుంబం కోసం పడుతున్న కష్టాలను అర్ధం చేసుకుని వారి ఆరోగ్యం పై శ్రద్ధ చూపాలని విజ్ఞప్తి వైద్య నిపుణులు చేశారు. గురువారం అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఉఫ్ ఇండియన్ ఆరిజాన్ ఉమెన్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో హైద్రాబాద్ మాదాపూర్ లోని హోటల్ ఆవాసాలో ఉమెన్స్ ఫోరమ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆపి అధ్యక్షురాలు డాక్టర్ అనుపమ గోటిముకల, ఉమెన్స్ ఫోరమ్ చైర్మన్ డాక్టర్ మెహర్ మేడవరం, డాక్టర్ సీమా అరోరా, డాక్టర్ ఉదయ శివాంగి, డాక్టర్ మాలతి మెహతా, డాక్టర్ ఉమా జొన్నలగడ్డ , డాక్టర్ సంత కుమారి, తేజస్విని మనోజ్ఞ , డాక్టర్ జూబి ఏ జాకబ్ నారా , ప్రీతి ఉపల, డాక్టర్ మీనాచ్చి మార్టిన్స్ తదితరులు పాల్గొని తమ స్వీయ అనుభవాలను వివరిందారు. పలువురు వైద్యులు అందించిన చేయూతతో వంద మందికి ఉచితంగా వాక్సిన్ వేయించేందుకు కార్యాచరణ రూపొందించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎస్ చైర్ డాక్టర్ ఉదయ సివంగి, చైర్ ఇండియా డాక్టర్ ద్వారకానాథ్ రెడ్డి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ రవి కొల్లి, కన్వీనర్ డాక్టర్ సుజీత్ ఉన్నం, కో చైర్ డాక్టర్ సతీష్ కత్తుల పాల్గొన్నారు.