పురుషులనూ వదలని చైన్ స్నాచర్లు

 Chain Snatcher Targeting Men…తస్మాత్ జాగ్రత్త

మెడలో చైన్ వేసుకుని, చేతులకు బ్రాస్లెట్ పెట్టుకుని బయట బజార్లో స్టైల్ గా తిరగాలి అనుకుంటున్న మగమహారాజులకు బ్యాడ్ న్యూస్. ఇకనుంచి నీ మెడలో చైన్ లు, నూతన బ్రాస్లెట్లు, వేళ్ళకు ఉన్న ఉంగరాలు చోరీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు చైన్ స్నాచర్స్. నమ్మశక్యంగా లేదా అయితే ఈ వార్త మీకోసమే
..
నిన్న మొన్నటి వరకు చైన్ స్నాచింగ్ అంటే ఒక మహిళ మెడలో నుంచి గొలుసులు దొంగతనం చేయడమే.. కానీ చైన్ స్నాచింగ్ లో కూడా డెవలప్మెంట్ కనిపిస్తుంది. ఇప్పుడు మహిళలు పురుషులు అనే తేడా లేకుండా ఎవరి మెడలో నైనా సరే బంగారం కనిపించిందంటే వారిపై దాడి చేయడమే.. వారి వద్ద నుండి గొలుసులు తెంపుకు వెళ్లడం జరుగుతోంది.

ఇప్పటి వరకు చైన్ స్నాచింగ్ అంటే రోడ్డుపై వెళుతున్న మహిళల మెడలోని పుస్తెల తాడును తెంపుకుని వెళ్లడమే.. చైన్ స్నాచింగ్ ఎక్కువగా మహిళలు మెడలో ఉన్న గొలుసు లపై జరగడంతో మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే పోలీసులు పలుమార్లు సూచనలు చేయడంతో మహిళలు అప్రమత్తమయ్యారు. దీంతో దొంగలు చూపు ఇప్పుడు పురుషులపై పడింది.
మగవారి మెడలోని చైన్‌లను తెంచుకుని వెళ్ళాలని వారు భావించినట్లుగా తెలుస్తుంది.
తాజాగా రాజేంద్రనగర్‌లో జరిగిన దొంగతనమే ఇందుకు నిదర్శనం. రాజేంద్రనగర్ న్యూఫ్రెండ్స్ కాలనీలో నివసించే రాఘవరెడ్డి కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం ఎప్పటిలాగానే తన షాపులో కూర్చొని ఉన్నాడు. ఈ సమయంలో బైక్‌పై హెల్మెట్ ధరించి వచ్చిన ఓ యువకుడు సిగరెట్ కావాలని అడిగాడు. సిగరేట్ ఇచ్చేందుకు రాఘవరెడ్డి కిందకు వంగిన వెంటనే… దుండగుడు అతని మెడలోని మూడు తులాల బంగారు గొలుసును అపహరించుకుని ఉడాయించాడు. రెప్పపాటులో జరిగిన ఈ సంఘటనతో రాఘవరెడ్డి షాక్‌కు గురయ్యాడు. వెంటనే షాక్ నుంచి తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి చైన్ స్నాచర్ల నుండి ఇకనుండి స్త్రీలే కాదు, పురుషులూ పారాహుషార్.

For More Click Here

More Latest Interesting news
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article