చైతు గ్రీన్ సిగ్న‌ల్‌

CHAITU GREEN SIGNAL
మంచి హిట్ కోసం కొంత‌కాలంగా వెయిట్ చేస్తున్న నాగ‌చైత‌న్య ఇప్పుడు శివ‌నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో `మ‌జిలీ` సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తి కాగానే.. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో వెంక‌టేష్‌తో క‌లిసి `వెంకీమామ‌` సినిమా చేస్తాడు. ఇది పూర్త‌వ‌గానే యు.వి.క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో సినిమా చేయ‌డానికి చైతు రెడీ అయ్యాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్క‌నుంద‌ట‌. `కృష్ణార్జున‌యుద్ధం` ప్లాప్ కావ‌డంతో మేర్ల‌పాక గాంధీ కాస్త గ్యాప్ తీసుకుని త‌యారు చేసుకున్న క‌థ‌లో న‌టించ‌డానికి చైతు ఓకే అన్నాడు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబ‌ర్‌లో మొద‌ల‌వుతుంద‌ని టాక్‌. చైతు, స‌మంత న‌టిస్తోన్న `మ‌జిలీ` ఏప్రిల్ 5న విడుద‌ల కానుంది.

For More Click Here

More Latest Interesting news
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article