నేడు చంద్రబాబు ఢిల్లీ టూర్

Chandra Babu Delhi Tour.. అందుకే

ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఒక పక్క రాష్ట్ర రాజకీయాలు, మరో పక్క కేంద్ర రాజకీయాలతో చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఏపీలో రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేయడంలో బిజీగా ఉన్న చంద్రబాబు ఈరోజు హుటాహుటిన ఢిల్లీకి వెళుతున్నారు.
ఢిల్లీలో చంద్రబాబు ఏపీలో ఇటీవల ఏర్పాటు చేసిన హైకోర్టు తాత్కాలిక భవనాలను ప్రారంభించడానికి సుప్రీం కోర్ట్ చీఫ్ జడ్జిని ఆహ్వానించనున్నారు. అంతేకాకుండా ఇప్పటికే బీజేపీయేతర కూటమి ఏర్పాటును ముమ్మరం చేస్తున్న క్రమంలో రేపు ఢిల్లీలో నాన్‌ ఎన్టీఏ పార్టీల సమావేశంలో పాల్గొననున్నారు. తాజాగా కోల్కత్తాలో జరిగిన యునైటెడ్ ఇండియా ర్యాలీలో తీసుకున్న నిర్ణయం మేరకు బెంగళూరు, ఢిల్లీలో నిర్వహించే జాతీయ స్థాయి సభల నిర్వాహణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇక ఈ సమావేశాలపై ఈ చర్చలు నిర్ణయం తీసుకునే అవకాశముంది. వచ్చే ఎన్నికల్లో బిజెపి ని గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు ఈ క్రమంలోనే కీలక భూమిక పోషిస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీల నేతలందరూ ఒక తాటి మీదకు వచ్చి బీజేపీ వ్యతిరేక పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే కోల్కత్తా లో పెట్టిన యాంటీ బిజెపి ర్యాలీ సక్సెస్ కావడంతో దేశవ్యాప్తంగా కోల్‌కతా తరహా సభలు పెట్టాలని విపక్షాలు భావిస్తున్నాయి. మరోవైపు కేంద్రం తీరుకు నిరసనగా చేపట్టాల్సిన కార్యక్రమాల షెడ్యూల్‌తో పాటు త్వరలో అమరావతిలో నిర్వహించే ధర్మ పోరాట సభ తేదీలను సీఎం చంద్రబాబునాయుడు త్వరలోనే ఖరారు చేయనున్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌పై జాతీయ స్థాయి పోరాటం చేసే విషయంలో కూడా వివిధ పార్టీల నేతలతో చర్చలు జరిపే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
మొత్తానికి కేంద్ర సర్కార్ పై సమర శంఖం పూరించడానికి దేశాల కలిసొచ్చే పార్టీలన్నిటినీ అందుకోసం సమాయత్తం చేయడానికి చంద్రబాబు సమాలోచనలు జరపడానికి వెళుతున్నట్లుగా తెలుస్తోంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article